Victory Venkatesh, Varun Tej
మెగా ఫ్యామిలీకి అన్ని శుభ శకునములే..!
ఏ ముహూర్తాన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆయన సతీమణి ఉపాసన కొణిదెల తల్లిదండ్రులుగా మారబోతున్నారని వార్త చిరు నోటి వెంట వచ్చిందో ఆనాటి నుంచి నేటి వరకు మెగా ఫ్యామిలీకి వరుసగా విజయాలు వరిస్తున్నాయి. ఈ ఏడాది మెగాస్టార్ ఫ్యామిలీలో సంబురాలు అంబరాన్నంటుతున్నాయి.
కొడుకు మెయింటెనెన్స్ కోసం నెలకు 70,000 ఇస్తున్నాడు: నరేశ్ మూడో భార్య
చిరంజీవి తాజా చిత్రం వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్‌ను కొల్లగొడుతోంది, రామ్ చరణ్ ఉపాసనలు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. RRR అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు గెలుచుకోవడంతో రికార్డులు సృష్టిస్తోంది. ఇలా మెగాస్టార్ కుటుంబానికి అన్ని శుభవార్తలే. అయితే వీటన్నిటితోడు మరో బిగ్ జోష్ మెగా ఫ్యామిలీ నుంచి వస్తుంది. మెగా హౌస్‌లో పెళ్లి భాజలు మోగబోతున్నాయని విశ్వనీయ సమాచారం.
మెగా హీరో చిరంజీవి తమ్ముడు నాగబాబు ముద్దుల కొడుకు వరుణ్ తేజ్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడట. వరుణ్ తేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ హీరో కూతుర్ని వివాహం చేసుకోబోతున్నాడని సోషల్ మీడియాలో ఒకే వార్తలు వస్తున్నాయి.
విక్టరీ వెంకటేష్ చిన్న కూతురు హయా వాహినిని వరుణ్ తేజ్ పెళ్లి చేసుకోసున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఇరు కుటుంబాలు పెళ్లి గురించి చర్చించుకున్నారని అన్నీ కుదిరితే త్వరలో పెళ్లి ప్రకటన వెలువడనుందని అంటున్నారు.
గతంలో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠితో ప్రేమలో ఉన్నాడని పుకార్లు వచ్చాయి. కానీ అది అబద్ధం అని తేలింది. మళ్ళీ ఇప్పుడు వెంకటేష్ చిన్న కూతురుతో పెళ్లి అని వస్తున్న వార్తలు ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది. మెగా లేదా దగ్గుబాటి ఫ్యామిలీ నుండి ఎవరైనా కన్ఫర్మ్ చేస్తే గాని ఈ వార్తలను నమ్మలేమని అభిమానులు అంటున్నారు.
దీంతో వరుణ్ తేజ్ పెళ్లి గురించి దగ్గుబాటి కొణిదెల కుటుంబాల నుంచి అధికారిక ప్రకటన కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక వెంకటేష్ వరుణ్ తేజ్‌లు కలిసి ఎఫ్2 ఎఫ్3 చిత్రాలలో కలిసిన నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో గాండీవధారి అర్జున్ అనే చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్దమవుతోంది.
మతులు పోగోడుతున్న ఉర్ఫీ జావేద్.. వీడియో చూస్తే పిచ్చెక్కాల్సిందే!