HomelatestHoney Rose | పెళ్లి అంటే బాధ్యత.. అందుకే ప్రేమలో ఉన్నా..! హనీరోజ్‌ కామెంట్స్‌ వైరల్‌..!

Honey Rose | పెళ్లి అంటే బాధ్యత.. అందుకే ప్రేమలో ఉన్నా..! హనీరోజ్‌ కామెంట్స్‌ వైరల్‌..!

Honey Rose | నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘వీరసింహారెడ్డి’లో టాలీవుడ్‌లో మరోసారి మెరిసింది మలయాళీ భామ హనీరోజ్‌. అందచందాలతో అభిమానుల దృష్టిని తన వైపు తిప్పుకున్నది. మలయాళీ ముద్దుగుమ్మ 2005లో బాయ్‌ఫ్రెండ్‌ చిత్రంతో చిత్ర సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది. 2008లో ‘ఆలయం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత పలు తమిళ చిత్రాల్లోనూ నటించినా.. ఈ
సినిమాలేవీ అంతగా గుర్తింపు రాకపోవడంతే కేవలం మలయాళం సినిమాలకే పరిమితమైంది. నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన వీరసింహారెడ్డి చిత్రంలో మంచి గుర్తింపు వచ్చింది.

ఈ క్రమంలో టాలీవుడ్‌లో వరుస అవకాశాలు వస్తున్నాయి. అలాగే పలు షాపింగ్‌ మాల్స్‌, రెస్టారెంట్లు ఓపెనింగ్స్‌కు యజమానులు నటిని ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల పలు ఈవెంట్లలో హనీరోజ్‌ సందడి చేశారు. తాజాగా హైదరాబాద్‌లోని ఓ రెస్టారెంట్‌ ఓపెనింగ్‌లో పాల్గొన్నది. ఆ తర్వాత మీడియా మాట్లాడింది. అయితే, హీరోయిన్లు ఎక్కడ కనిపించినా.. ‘పెళ్లి’ ఎప్పుడు అనే ప్రశ్న ఎదురవుతూనే ఉంటుంది. హనీరోజ్‌కు సైతం పెళ్లి ఎప్పుడు? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. పెళ్లిపై హనీరోజ్‌ చేసిన వ్యాఖ్యలు చేసింది. పెళ్లి అనేది ఓ బాధ్యత అని, అందుకే ప్రతి విషయాన్ని నేను ప్రేమిస్తానని.. అంత వరకే వెళ్తాను అని చెప్పింది.

ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంకా మాట్లాడుతూ.. వీరసింహారెడ్డి సినిమాలోని నా పాత్రకు మంచి గుర్తింపు వచ్చిందని, తెలుగు ప్రేక్షకులు ఆ పాత్రను బాగా ఆదరించారని చెప్పింది. బాలకృష్ణలాంటి లెజెండరీ యాక్టర్‌తో స్క్రీన్‌షేర్ చేసుకునే అవకాశం నాకు దక్కినందుకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపింది. సినిమాలో రెండు విభిన్నమైన పాత్రలు పోసించానని, ఇందుకు కోసం చాలా కష్టపడ్డానని చెప్పుకొచ్చింది. దర్శకుడు గోపీచంద్ మలినేని ఫోన్‌లో తన పాత్ర గురించి వివరించారని, షూటింగ్‌ సమయంలో బాలయ్య నటన గురించి సలహాలు సూచనలు ఇచ్చారని తెలిపింది.

నటన అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టమని, 2005లోనే నేను ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చానంది. సినిమాలు తప్ప నాకు మరో ప్రపంచం లేనట్టు ఉన్నాని తెలిపింది. కేరళ వంటకాలను బాగా ఇష్టంగా తింటానని, ఇక హైదరాబాద్ బిర్యానీ, రైస్, పెరుగు బాగా నచ్చుతాయని చెప్పింది. సోషల్‌ మీడియాపై స్పందిస్తూ.. సామాజిక మాధ్యమాల్లో మంచీచెడు రెండూ ఉంటాయని మలయాళీ భామ తనదైన స్టయిల్‌లో సమాధానాలు ఇచ్చింది.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular