Vemulawada
విధాత బ్యూరో, కరీంనగర్: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శృంగేరి మహాసంస్థానం ఆధ్వర్యంలో లోక కళ్యానార్థం వేద సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న దాదాపు 300 మంది వేద పండితులు హాజరయ్యారు.
ఓపెన్ స్లాబ్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై శారద మాత విగ్రహానికి పూజలు నిర్వహించిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. కార్యక్రమానికి హాజరైన శృంగేరి పీఠం నుంచి వచ్చిన అధికారులు మాట్లాడుతూ, భారత దేశంలో కరోనా మహమ్మారి తర్వాత, దేశవ్యాప్తంగా వివిధ సదస్సులు నిర్వహించాలన్న జగద్గురు శ్రీ శృంగేరి పీఠాధిపతి భారతి తీర్థ మహా స్వామి ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నమని చెప్పారు.
వేద గోష ఎక్కడ జరిగితే ఆ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉంటుందని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ వేదిక సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.