విధాత: ఈ సంక్రాంతికి టాలీవుడ్లో టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మొదటిసారిగా కోలీవుడ్లోకి అడుగుపెట్టి మొదటి చిత్రమే కోలీవుడ్ దళపతి విజయ్‌తో తీశాడు. ఈ చిత్రం తమిళ్లో వారీసుగా విడుదలవగా తెలుగులో వారసుడిగా డబ్బింగ్ అయ్యింది. ఇదే కథతో తెలుగులో గతంలో పలు చిత్రాలు వచ్చాయి.
దాంతో వారసుడు చిత్రం చద్ది పులిహార కలిగిన టైపులో ఉందని వినిపిస్తున్నాయి. ఎప్పుడో 20, 30 ఏళ్ల క్రితం ఇలాంటి చిత్రాలకు ఆదరణ దక్కేది. కానీ నేడు ప్రేక్షకులు ఇలాంటి చిత్రాలను పెద్దగా ఆదరించడం లేదు. చూసి చూసి బోర్ గా ఫీల్ కావడంతో ఆ వైఫై కనెక్ట్ చూడటం లేదు.
ఇక మహర్షి, శ్రీమంతుడు చిత్రాలు కూడా ఇదే తరహాలో రూపొందినప్పటికీ అందులోని పాత్రలు గొప్ప ధనవంతుల నుంచి సామాన్యుల వద్దకు వెళ్లే రకంగా కథలు సాగాయి. దాంతో ఓ బడా ధనవంతుడైన హీరో సామాన్యుల వద్దకు రావడంతో ఈ చిత్రాలు సామాన్యులకు కూడా నచ్చాయి. దాంతో జనరల్ ఆడియన్స్ ఈ చిత్రాలను బాగానే ఆదరించారు.
కానీ వారసుడు చిత్రం పరిస్థితి వేరు. సినిమా అంతా కార్పొరేట్ సామ్రాజ్యమే. చిత్రంలో హీరో పాత్ర మొత్తం ధనవంతుడిగా ఓ పెద్ద బిజినెస్ మాగ్నెట్గా తన తండ్రి బిజినెస్ సామ్రాజ్యాన్ని కాపాడే కొడుకుగా సాగింది. దాంతో ఇది సామాన్య ప్రేక్షకులను కనెక్ట్ కాలేకపోయింది.
సినిమాలో తమిళ నటీనటులు ఉన్నప్పటికీ తెలుగు సెంటిమెంట్ బాగా డామినేట్ చేయడంతో ఈ సెంటిమెంట్ తమిళ తంబీలకు నచ్చలేదు. వారు ఈ చిత్రంతో కనెక్ట్ కాలేక పోయారు. కార్పొరేట్ బిజినెస్ బ్యాక్ డ్రాప్లో ఉమ్మడి కుటుంబం నేపథ్యంలో బంధాలు అనుబంధాలను గుర్తు చేస్తూ ఈ మూవీని వంశీ పైడిపల్లి తీశాడు.
ఈ చిత్రానికి తమిళంలో మొదట పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ మూడు రోజుల్లోనే డివైడ్ టాక్ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. మొదటి రోజు రూ.20 కోట్ల వరకు కలెక్ట్ చేసిన ఈ చిత్రం రెండో రోజుకి 60 శాతం డ్రాప్‌తో రూ.9 కోట్లు మాత్రమే వసూలు చేసింది.
మూడో రోజు కేవలం ఏడు కోట్లకే పరిమితమైంది. ఓవరాల్‌గా మూడు రోజుల్లో ఈ మూవీ కేవలం రూ.35 కోట్లకు అటు ఇటుగా మాత్రమే వసూళ్లను సాధించింది. విజయ్‌కు ఉన్న మార్కెట్ దృష్ట్యా ఈ చిత్రం ఇప్పటికే రూ.100 కోట్ల క్లబ్లో చేరి ఉండాలి. కానీ వారీసు చిత్రం అందుకు విభిన్నంగా సాగుతోంది.
విజయ్ కెరీర్లోనే ఈ చిత్రం బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీగా మారబోతోందని కోలీవుడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ చిత్రం డిజాస్టర్ అయినప్పటికీ ఈ సినిమాను దిల్ రాజు భారీ ధరలకు థియేటికల్ రైట్స్ ముందుగానే అమ్మేశాడు.
దాంతో ఆ సినిమా నష్టాల నుంచి ఆయన తప్పించుకున్నాడు. అయితే తెలుగులో కూడా వారసుడికి నష్టాలు కచ్చితంగా వస్తాయి. వీటిని మాత్రం దిల్ రాజు భరించాల్సిందే అనేది సుస్పష్టం. మొత్తానికి దిల్ రాజు ఆశలు ఈ చిత్రంతో అడియాశలుగా మారాయినేది సుస్పష్టంగా అర్ధమవుతోంది.