Congress | కేడర్‌లో కొత్త జోష్‌ ఆరు గ్యారెంటీలతో గెలుపుపై ధీమా విధాత: తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ వరుసగా హైద్రాబాద్‌లో సీడబ్ల్యుసీ సమావేశాలు, తుక్కుగూడలో విజయభేరీ బహిరంగ సభలను విజయవంతంగా నిర్వహించుకోవడం ద్వారా రాష్ట్రంలో అధికార సాధనకు అసెంబ్లీ ఎన్నికల దిశగా సమరోత్సాహంతో ముందడుగు వేసింది. సీడబ్ల్యుసీ సమావేశాల నిర్వాహణతో రెండు రోజుల పాటు రాష్ట్ర, దేశ ప్రజల దృష్టిని హైద్రాబాద్‌ వైపు మళ్లించగలిగిన టీపీసీసీ సోనియాగాంధీ తుక్కుగూడ సభలో తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ఆరు గ్యారెంటీలను […]

Congress |

  • కేడర్‌లో కొత్త జోష్‌
  • ఆరు గ్యారెంటీలతో గెలుపుపై ధీమా

విధాత: తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ వరుసగా హైద్రాబాద్‌లో సీడబ్ల్యుసీ సమావేశాలు, తుక్కుగూడలో విజయభేరీ బహిరంగ సభలను విజయవంతంగా నిర్వహించుకోవడం ద్వారా రాష్ట్రంలో అధికార సాధనకు అసెంబ్లీ ఎన్నికల దిశగా సమరోత్సాహంతో ముందడుగు వేసింది. సీడబ్ల్యుసీ సమావేశాల నిర్వాహణతో రెండు రోజుల పాటు రాష్ట్ర, దేశ ప్రజల దృష్టిని హైద్రాబాద్‌ వైపు మళ్లించగలిగిన టీపీసీసీ సోనియాగాంధీ తుక్కుగూడ సభలో తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ఆరు గ్యారెంటీలను ప్రకటించి అధికార బీఆరెస్‌కు, విపక్ష బీజేపీకి గట్టి సవాల్‌ విసరగలిగింది.

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు గ్యారెంటీలను ప్రకటించి విజయం సాధించిన కాంగ్రెస్‌ తెలంగాణలో ఆరుగ్యారెంటీల ప్రకటనతో జనంలో తన ఎన్నికల ప్రచారాన్ని విజయభేరీ సభ ద్వారా ఘనంగా ఆరంభించింది. పార్టీలో సీనియర్ నాయకుల మధ్య అంతర్గత విబేధాలున్నా వాటన్నింటిని పక్కన పెట్టి అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలు హాజరైన విజయభేరీ సభను విజయవంతం చేయడంలో అంతా ఒక్కటిగా పనిచేశారు. జనసమీకరణలో సీనియర్లతో పాటు టికెట్లు ఆశిస్తున్న ఆశావహ నాయకులంతా పోటీ పడి జన సమీకరణ చేయడంతో తుక్కుగూడ విజయభేరీ సభ జన కెరటాన్ని తలపించింది.

భారీగా తరలివచ్చిన ప్రజలు, పార్టీ శ్రేణులతో తుక్కుగూడ సభా ప్రాంగణం క్రిక్కిరిసిపోగా, తమ అగ్రనేతల ప్రసంగాల సందర్భంగా సభా ప్రాంగణం ఈలలు, కేరింతలతో మారుమ్రోగింది. ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీలకు ధీటుగా ఉన్న ఆరు గ్యారెంటీలతో తమ పార్టీకి ఖచ్చితంగా ప్రజాదరణ లభిస్తుందన్న నమ్మకం కేడర్‌లో కొత్త జోష్ నింపింది. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గేలతో పాటు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క వంటి నాయకులు మాట్లాడిన సందర్భాల్లో పార్టీ కేడర్ ఈలలతో హోరెత్తించించారు.

సోనియాగాంధీ ప్రసంగం సందర్భంగా జై తెలంగాణ..జై సోనియమ్మ నినాదాలతో హోరెత్తించారు. ఇటు తెలంగాణతో పాటు అటు కేంద్రంలోనూ వచ్చేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలేనంటూ వారంతా తమ ప్రసంగాల్లో ధీమా వ్యక్తం చేసి కేడర్‌లో ఉత్సాహం రేకెత్తించారు. ముఖ్యంగా ఖర్గే, రాహుల్‌లు బీఆరెస్‌, బీజేపీలు ఒక్కటేనంటూఐ తెలంగాణను కేసీఆర్ అప్పుల పాలు చేశారంటూ చేసిన విమర్శల సందర్భంగా కూడా సభికుల నుండి చప్పట్లు వ్యక్తమయ్యాయి.

ఎన్నికల వాగ్ధానాల విషయంలో కాంగ్రెస్ మాట ఇస్తే తప్పేది లేదంటూ నేతలు పునరుద్ఘాటించారు. సోనీయాగాంధీ సభా వేదికపైకి రాగానే ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన సోనియాగాందీకి కృతజ్ఞతలు అంటూ గద్దర్ మాట్లాడిన వీడియోను ప్రదర్శించడం సభికులలో ఉత్సాహం రగిలించింది. ఆరు హామీలను నేతలు ఒక్కోక్కటిగా ప్రకటించిన సందర్భంలో పార్టీ శ్రేణులు భారీ ఎత్తున చప్పట్లతో తమ హార్షద్వానాలతో తమ ఆమోదం తెలిపారు.

బహిరంగ సభకు కాంగ్రెస్ నాయకులు భారీ వాహన శ్రేణులతో తరలివచ్చారు. ఉప్పల్ నియోజకవర్గం చెందిన సింగిరెడ్డి సోమ సాకర్ రెడ్డి బై బై కేసీఆర్ అంటూ నిర్మించిన ఫ్లేక్సీ వీడియో పలువురిని ఆకట్టుకుంది. గచ్చిబౌలి 105 డివిజన్ కి చెందిన భరత్ కుమర్ అనే వ్యక్తి 100 మీటర్ల కాంగ్రెస్ జెండాను దారి పొడవునా ప్రదర్శించడం కార్యకర్తలను ఉత్సహ పరిచింది. సభలో రాహుల్‌, సోనియాగాంధీలకు కొండా సురేఖ దంపతులు పోచంపల్లి చీరలు, వస్త్రాలను బహుకరించారు.

Updated On 17 Sep 2023 4:39 PM GMT
krs

krs

Next Story