విధాత: విజయవాడ తెలుగుదేశంలో నిప్పు రాజుకుంది. టీడీపీ తరఫున గెలిచిన ముగ్గురు ఎంపిల్లో ఒకరైన కేశినేని నాని పార్టీ అధిష్టానాన్ని ధిక్కరిస్తున్నారు. అంతేకాకుండా దొంగలు.. అవినీతిపరులు.. ముఠా కోర్లు.. వీళ్లకు టిక్కెట్లు ఇస్తే తాను అంగీకరించేది లేదని, అలా అయితే పార్టీ కూడా గెలవడం కష్టమని కుండ బద్దలుకొట్టారు. 2014, 2019 ఎన్నికల్లో రెండుసార్లు టీడీపీ నుంచి ఎంపీగా గెలిచిన తాను విజ‌య‌వాడ ఎంపీగా పోటీ చేయ‌ర‌నే ప్ర‌చారంపై కేశినేని స్పండిస్తూ.. తాను. ఎంపీగా పోటీ చేయ‌న‌ని […]

విధాత: విజయవాడ తెలుగుదేశంలో నిప్పు రాజుకుంది. టీడీపీ తరఫున గెలిచిన ముగ్గురు ఎంపిల్లో ఒకరైన కేశినేని నాని పార్టీ అధిష్టానాన్ని ధిక్కరిస్తున్నారు. అంతేకాకుండా దొంగలు.. అవినీతిపరులు.. ముఠా కోర్లు.. వీళ్లకు టిక్కెట్లు ఇస్తే తాను అంగీకరించేది లేదని, అలా అయితే పార్టీ కూడా గెలవడం కష్టమని కుండ బద్దలుకొట్టారు.

2014, 2019 ఎన్నికల్లో రెండుసార్లు టీడీపీ నుంచి ఎంపీగా గెలిచిన తాను విజ‌య‌వాడ ఎంపీగా పోటీ చేయ‌ర‌నే ప్ర‌చారంపై కేశినేని స్పండిస్తూ.. తాను. ఎంపీగా పోటీ చేయ‌న‌ని ఎవ‌ర‌న్నార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ప్ర‌జ‌లు కోరుకుంటే ఇండిపెండెంట్ అభ్య‌ర్థిగా బ‌రిలో దిగుతాన‌ని అన్నారు.

వాస్తవానికి త‌న వ్య‌తిరేకుల‌ను చంద్ర‌బాబు, టీడీపీ అధిష్టాన పెద్ద‌లు కొంద‌రు ప్రోత్సాహిస్తున్నారని నాని నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే తాను ఆవేదనతో ఆవేశంగా మాట్లాడుతున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈసారి నానికి బదులు ఆయన సోదరుడి శివనాథ్ కు టిక్కెట్ ఇస్తారని టిడిపి అధిష్టానం తరఫున లీకులు ఇస్తున్నారు. దీంతో ఈ అంశం మీదా నాని గుర్రుమంటున్నారు. తనను కాదని వేరేవాళ్లకు టికెట్ ఇస్తే జరిగే పరిణామాలు వేరేగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఇప్పుడు శివనాథ్ లైన్లోకి వచ్చారు. తన వాయిస్ వినిపిస్తున్నారు. తన అన్న ఆవేశంతో మాట్లాడుతున్నారని తెలిపారు. చంద్రబాబును సీఎం చేసేందుకు అందరం కలసి పనిచేస్తామని చెప్పారు. తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని ఎక్కడా చెప్పలేదని గుర్తు చేశారు. తాను కేవలం సేవా కార్యక్రమాలు మాత్రమే నిర్వహిస్తున్నానన్నారు.

ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా నడుస్తామని తెలిపారు. పార్టీ కోసం శ్రమిస్తున్నామని తెలిపారు. ఎన్టీఆర్ జీవితం అందరికీ ఆదర్శం అన్నారు. గొల్లపూడిలో పార్టీ కార్యాలయం విషయంలో ప్రభుత్వం వైఖరి సరికాదని కేశినేని చిన్ని ధ్వజమెత్తారు.

కేశినేని నాని కామెంట్లపై స్పందించిన కేశినేని చిన్ని పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వారికి సహకరిస్తానని స్పష్టం చేశారు. కేశినేని నానికి టికెట్ ఇచ్చినా తాను మద్దతు ఇస్తానని వెల్లడించారు. మొత్తానికి అన్నదమ్ములు హాట్ హాట్ వ్యాఖ్యలతో మొత్తం రాజజీయలను వేడెక్కించారు.

Updated On 18 Jan 2023 10:17 AM GMT
krs

krs

Next Story