Yadadri | విధాత: తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయంలో సోమవారం నుంచి భక్తులకు బ్రేక్‌ దర్శనాలు అందుబాటులోకి రానున్నాయి. ఉదయం 9 నుంచి 10 వరకు, సాయంత్రం 4 నుంచి 5 వరకు రెండు దఫాలుగా అనుమతించనున్నారు. ఉదయం 200, సాయంత్రం 200 మందికి అవకాశం కల్పిస్తామని ఆలయ ఈవో గీత తెలిపారు. వీఐపీ, వీవీఐపీ భక్తులు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారి సిఫార్సులపై వచ్చే భక్తులు, రూ.300 టికెట్‌ తీసుకున్న భక్తులను […]

Yadadri | విధాత: తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయంలో సోమవారం నుంచి భక్తులకు బ్రేక్‌ దర్శనాలు అందుబాటులోకి రానున్నాయి. ఉదయం 9 నుంచి 10 వరకు, సాయంత్రం 4 నుంచి 5 వరకు రెండు దఫాలుగా అనుమతించనున్నారు. ఉదయం 200, సాయంత్రం 200 మందికి అవకాశం కల్పిస్తామని ఆలయ ఈవో గీత తెలిపారు.

వీఐపీ, వీవీఐపీ భక్తులు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారి సిఫార్సులపై వచ్చే భక్తులు, రూ.300 టికెట్‌ తీసుకున్న భక్తులను బ్రేక్‌ దర్శనాలకు అనుమతించనున్నట్టు తెలిపారు. ఆ సమయంలో ధర్మదర్శనంతోపాటు రూ.150 ప్రత్యేక దర్శనాలను నిలిపివేయనున్నట్టు ఈవో గీత వివరించారు.

Updated On 30 Oct 2022 5:26 AM GMT
subbareddy

subbareddy

Next Story