Viral Video | యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌, నివేతా పేతురాజ్‌ జంటగా నటించిన చిత్రం దాస్‌ కా దమ్కీ. ఎన్నో అంచనాలతో ఉగాది పండుగ సందర్భంగా విడుదలైంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన చిత్రం అభిమానులను ఆకట్టుకుంటున్నది. అయితే, కొన్నిచోట్ల చిత్రాన్ని చూసేందుకు వెళ్లిన అభిమానులకు నిరాశ ఎదురైంది. ధమ్కీసినిమా చూసేందుకు ఎంతో ఉత్సాహంతో థియేటర్లకు వెళ్లిన వారికి దాస్‌ క దమ్కీ బదులుగా.. రవితేజ ‘ధమాకా’ చిత్రాన్ని ప్రదర్శించడంతో అంతా షాక్‌కు గురయ్యారు. ఒక […]

Viral Video | యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌, నివేతా పేతురాజ్‌ జంటగా నటించిన చిత్రం దాస్‌ కా దమ్కీ. ఎన్నో అంచనాలతో ఉగాది పండుగ సందర్భంగా విడుదలైంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన చిత్రం అభిమానులను ఆకట్టుకుంటున్నది.

అయితే, కొన్నిచోట్ల చిత్రాన్ని చూసేందుకు వెళ్లిన అభిమానులకు నిరాశ ఎదురైంది. ధమ్కీసినిమా చూసేందుకు ఎంతో ఉత్సాహంతో థియేటర్లకు వెళ్లిన వారికి దాస్‌ క దమ్కీ బదులుగా.. రవితేజ ‘ధమాకా’ చిత్రాన్ని ప్రదర్శించడంతో అంతా షాక్‌కు గురయ్యారు. ఒక సినిమాకు బదులు మరో సినిమాను ప్రదర్శించడంతో థియేటర్లలో అభిమానులు గగ్గోలు పెట్టారు. యాజమాన్యంపై మండిపడ్డారు.

ఈ ఘటన వైజాగ్‌ సుకన్య థియేటర్‌లో చోటు చేసుకున్నది. విశ్వక్‌ సేన్‌ సినిమాకు బదులుగా.. రవితేజ సినిమా సూచించారు. టైటిల్ విషయంలో నిర్వాహకులు పొరపాటు పడ్డారా? లేక మరేదైనా సమస్యతో చిత్రం ప్రదర్శించారా? అనే విషయం తెలియలేదు.

ఒక సినిమాకు బదులు మరో సినిమా ప్రదర్శించడంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సినిమా కోసం టికెట్లు అమ్మి.. మరో సినిమాను చూపించారు ఓరి దేవుడో అంటూ కేకలు వేస్తూ థియేటర్‌ గోల చేశారు. కొందరు దీన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టగా వైరల్‌గా మారింది.

Updated On 23 March 2023 6:33 AM GMT
Vineela

Vineela

Next Story