Viral Video | ట్రక్కుల మధ్యలో నుంచి ఓ చిరుత పులి నక్కి నక్కి వచ్చి కుక్క పిల్లను ఎత్తుకెళ్లింది. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణె సమీపంలో చోటు చేసుకుంది.
ప్రధాన రహదారిపై ట్రక్కులు, లారీలు రిపేర్ చేసే షాపుల వద్ద ఓ వ్యక్తి మంచంపై నిద్రిస్తున్నాడు. ఆ వ్యక్తికి నాలుగైదు అడుగుల దూరంలో ఓ కుక్క పిల్ల పడుకుని ఉంది. అయితే ఆ కుక్క పిల్లను చిరుత పసిగట్టింది. ట్రక్కుల మధ్యలో నుంచి మెల్లి మెల్లిగా కుక్క పిల్ల వద్దకు చేరుకుంది.
మంచంపై పడుకున్న వ్యక్తికి ఎలాంటి హానీ కలిగించకుండా, కుక్క పిల్లను నోటితో కరిచి ఎత్తుకెళ్లింది. అయితే అక్కడ నిద్రిస్తున్న వ్యక్తికి కూడా పులి రాకతో మెలకువ వచ్చింది. లేచి చూసేసరికి పులి కుక్కను ఎత్తుకెళ్లింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.