Viral Video | మనం ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లినా.. పర్యాటక ప్రాంతానికి వెళ్లినా.. అక్కడ ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపిస్తుంటాం. ఆ విధంగానే ఓ ఫ్యామిలీ కూడా ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపించింది. కానీ మరో కుటుంబం అక్కడ్నుంచి కదల్లేదు. దీంతో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. ఫ్లోరిడా ఓర్లాండోలోని వాల్ట్ డిస్నీ వరల్డ్ వద్ద పర్యాటకులు ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. అయితే డిస్నీ వరల్డ్ చిహ్నం ముందు ఓ ఫ్యామిలీ ఫోటోలు దిగేందుకు అధిక సమయం వెచ్చించింది. ఆ చిహ్నం ముందే ఫోటోలు దిగేందుకు మరో ఫ్యామిలీ కూడా వెయిట్ చేస్తోంది. అయితే తాము కూడా ఫోటోలు దిగాలి.. కొంచెం పక్కకు జరగండి అని ఆ ఫ్యామిలీ మెంబర్స్‌ని రెండో ఫ్యామిలీ వారు అడిగారు.
దీంతో అక్కడ ఫోటోలు దిగుతున్న కుటుంబ సభ్యుల్లో ఒకరు రెచ్చిపోయారు. పక్కకు జరగండి అన్న పాపానికి వారిపై పంచుల వర్షం కురిపించారు. కింద పడేసి కొట్టారు. ఈ దృశ్యాలను అక్కడున్న వారు తమ మొబైల్స్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
Happiest place on Earth. #Disneyworld
Disney World brawl: Disagreement between families over picture leads to fight. pic.twitter.com/ub1brY7wRd— 🔱⚓️🏴☠️🇺🇸I’m The One Called Doc🇺🇸🏴☠️⚓️🔱 (@hmcrem) May 17, 2023