Viral Video |
విధాత: సింహాలు, పెద్ద పులులను చూస్తూ మిగతా అడవి జంతువులన్నీ పారిపోయాయి. తమ ప్రాణాలను రక్షించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తాయి. కానీ ఈ ఏనుగుల ముందు ఓ పెద్ద పులి వెనుకడుగు వేసింది.
ఏనుగులు రాజసంగా నడుచుకుంటూ వెళ్తుంటే.. పులి పిల్లిలా పొదల చాటున నక్కింది. ఆ ఏనుగుల గుంపు ముందుకు వెళ్లిన తర్వాత పులి మెల్లిగా లేచి నడవసాగింది. అయితే మరో ఏనుగు అటు వైపు రావడంతో.. మళ్లీ పులి చెట్ల పొదల్లోకి పరుగెత్తింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ వీడియోను ఇండియన్ ఫారెస్టు అధికారి సుశాంత నంద తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. 12 వేల మంది వీక్షించి, పలువురు లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు. ఏనుగులకు పులి గౌరవం ఇచ్చిందని ఒకరంటే.. ఈ దృశ్యం చూడటానికి ముచ్చటగా ఉందని మరో నెటిజన్ పేర్కొన్నాడు