Sunday, December 4, 2022
More
  Homelatest‘మా’పై కామెంట్స్ చేస్తే సభ్యత్వం కట్.. అయ్యా విష్ణు బాబు ఏంటిది?

  ‘మా’పై కామెంట్స్ చేస్తే సభ్యత్వం కట్.. అయ్యా విష్ణు బాబు ఏంటిది?

  మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికై సంవత్సరం పూర్తయిన సందర్భంగా.. గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ యేడాదిలో ఏమేం చేశారో.. ఏమే నిర్ణయాలు తీసుకున్నారో.. అలాగే ఎన్నికలలో ప్రధాన హామీ అయినటువంటి ‘మా’ భవనం ఎక్కడ నిర్మించాలని అనుకుంటున్నారో వంటి విషయాలను ఈ మీడియా సమావేశంలో మంచు విష్ణు వెల్లడించారు. అయితే ఆయన స్పీచ్ విన్న తర్వాత.. మరీ నిరంకుశత్వ పాలనలా.. ఆర్టిస్టులను బానిసల మాదిరిగా ట్రీట్ చేయాలని మంచు వారు బాగానే ప్లాన్ చేసినట్లుగా అనిపిస్తుంది.

  ముఖ్యంగా ‘మా’ సభ్యత్వం ఉన్నవారు.. ‘మా’లో ఏం జరిగినా.. మూసుకుని ఉండాలని.. మీడియాకి ఎక్కకూడదని, అలాగే ధర్నాలు చేయకూడదని.. చేస్తే సభ్యత్వం తీసేస్తామనే నిర్ణయం.. ఆర్టిస్ట్‌లను బెదిరించినట్లుగానే ఉందంటూ కొందరూ నటీనటులు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి. మరో విషయం ఏమిటంటే.. ఈ స్పీచ్ అంతా మోహన్ బాబు ఆధ్వర్యంలోనే జరగడం. మోహన్ బాబు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై.. కంట్రోలింగ్ పవర్ అంతా మా చేతుల్లోనే ఉంది.. ఇకపై మేమే పెద్దలం అనే అభిప్రాయాన్ని కలిగించే ప్రయత్నం చేసినట్లుగా అనిపిస్తోంది.

  మంచు విష్ణు స్పీచ్‌ ఎలా సాగిందంటే..

  ‘‘2021 ‘మా’ ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాలలోని సాధారణ ఎన్నికలను తలపించాయి. అక్టోబర్ 13న మా అధ్యక్షుడిగా ఛార్జ్ తీసుకున్నాను. నేను మా ఎన్నికలో నిలబడినప్పుడు ఎటువంటి సంఘటనలు జరిగాయో తెలిసిందే. అక్టోబర్ 10 ఎన్నికలు జరిగాయి. 10, 11 తేదీలలో రిజల్ట్స్ పూర్తిగా వచ్చాయి. 13న అధ్యక్షుడిగా నేను ఛార్జ్ తీసుకున్నాను. ఎన్నికలు జరిగిన తీరు ప్రకారం.. నేను మా అసోసియేషన్‌కు మాత్రమే కాదు.. ప్రేక్షకులకు కూడా జవాబుదారినే.

  మా ఎన్నికల్లో నేను చేసిన హామీలు 90 శాతం పూర్తయ్యాయి. సంక్రాంతి తర్వాత ‘మా’ యాప్‌ను తీసుకొస్తాం. అన్ని నిర్మాణ సంస్థలను, సీనియర్ నిర్మాతలను, ఇప్పుడున్న నిర్మాతలను కలిసి.. ఆర్టిస్ట్‌ల డిటైల్స్‌తో ఓ బుక్‌లెట్ ఇవ్వడం జరిగింది. త్వరలో వచ్చే యాప్‌లో ‘మా’లో సభ్యత్వం ఉన్న వారందరికీ ఏయే నిర్మాణ సంస్థలో ఏయే సినిమాలు జరుగుతున్నాయి.. వారికి కావాల్సిన ఆర్టిస్ట్‌లు ఎవరు అనేది ఈజీగా తెలిసిపోతుంది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇటువంటిది ఇదే ఫస్ట్ టైమ్.

  అలాగే సభ్యత్వం విషయంలో కూడా కఠినంగా వ్యవహరించేలా నిర్ణయం తీసుకున్నాం. మా అసోసియేషన్‌లో 20 శాతం మంది.. నటులు కాని సభ్యులున్నారు. మా అసోసియేషన్ సభ్యత్వాన్ని కఠినంగా ఉండేలా తుది నిర్ణయం తీసుకున్నాం. నా ఒక్కడి మాటతోనే ఇక్కడ అన్నీ నడవవు. ఈసీ మెంబర్స్‌తో చర్చలు జరిపి, వారితో గొడవలు పడి మరీ నిర్ణయం తీసుకుంటున్నాం. ఇక నుంచి లైఫ్‌ మెంబర్స్‌కి మాత్రమే ఓటు హక్కుతో పాటు ఫ్రీ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఉంటుంది. అసోసియేట్‌ మెంబర్స్‌కి అవేవీ ఉండవు.

  నిబంధనలకు విరుద్ధంగా ‘మా’లో మెంబర్స్‌ కానీ వారికి ఆరుగురికి ఫించన్‌ ఆపేశాం. నటీనటులు రెండు సినిమాల్లో నటించి, ఆ సినిమాలు విడుదలైతేనే ‘మా’లో శాశ్వత సభ్యత్వం. కనీసం 5 నిమిషాలైనా సినిమాలో కనిపించి డైలాగు చెప్పిన వాళ్లకు అసోసియేట్ సభ్యత్వం. అసోసియేట్ సభ్యులకు మాలో ఓటు హక్కు లేదు. ‘మా’ అసోసియేషన్‌కు వ్యతిరేకంగా నటీనటులు, కార్యవర్గ సభ్యులు ఎవరైనా సరే.. ధర్నాలు, మీడియాకు ఎక్కడం వంటివి చేస్తే వారి సభ్యత్వం శాశ్వతంగా రద్దు చేస్తాం. ‘మా’కు వ్యతిరేకంగా ఎలాంటి పోస్టులు చేసినా వారు అనర్హుల కిందే పరిగణింపబడతారు. ఐదేళ్లపాటు శాశ్వత సభ్యుడిగా ఉంటేనే మా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుంది.

  ఇక ప్రధానమైన ‘మా’ భవనం విషయంలో నేను రెండు ప్రతిపాదనలు తీసుకువచ్చాను. ఫిల్మ్‌ ఛాంబర్‌కు 20–30 నిమిషాల వ్యవధిలో చేరుకునే ప్రాంతంలో ఓ బిల్డింగ్‌ చూశాను. అది మొదటి ఆప్షన్. దానిని ఎన్నుకుంటే.. ఆరు నెలల్లో అది పూర్తవుతుంది. రెండోది.. ఫిల్మ్‌ ఛాంబర్‌ బిల్డింగ్‌ తీసేసి కొత్త బిల్డింగ్‌ కట్టాలని. అక్కడ నేను కొంత స్థలం కొని ఇస్తాను.

  అక్కడ ‘మా’ ఆఫీస్‌ను రూపొందించాలి. దీనికి మూడు – నాలుగేళ్లు పడుతుంది. మేం నిర్వహించుకున్న మీటింగ్‌లో అందరూ రెండో ఆప్షన్‌ కోరుకున్నారు. ఈ రెండింటిలో ఏదీ ఓకే అయినా ఆ పనులు నా డబ్బుతోనే పూర్తి చేస్తాను..’’. ఇవి మంచు విష్ణు ఈ ‘మా’ సమావేశంలో చెప్పిన ముచ్చట్లు.

  RELATED ARTICLES

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  Cinema

  Politics

  Most Popular

  You cannot copy content of this page