విధాత: తెలుగు వారికి విష్ణుప్రియ, రీతూ చౌదరిల గురించి బాగానే తెలుసు. సుధీర్‌తో కలిసి చేసిన కొన్ని కార్యక్రమాలతో విష్ణుప్రియ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తర్వాత సినిమాల్లో అవకాశాలు కూడా సంపాదించింది. కొంతకాలంగా ఆమె సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో రచ్చ రచ్చ చేస్తోంది. తన అందాలను హద్దులు దాటి ప్రదర్శిస్తూ.. అటెన్షన్ పొందాలని చూస్తోంది.
మరీ ముఖ్యంగా నాభి సౌందర్యం, క్లీవేజ్ ప్రదర్శనలతో రెచ్చిపోతోంది. ఇదే సమయంలో రీతూ చౌదరి కూడా ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. రీల్స్‌తో ఫేమస్ అయినా రీతూ కొన్ని షోస్ చేసింది. యాంకర్‌గా మొదలుపెట్టి సీరియల్స్‌లో తన టాలెంట్, అందచందాలతో ఆకట్టుకొని జబర్దస్త్ షోలో కూడా రాణిస్తోంది.
గాయత్రి అలియాస్ రీతూ చౌదరి లేడీ కమెడియన్‌గా సత్తా చాటుకుంటూ సోషల్ మీడియాలో తన అందంతో ఈ ముద్దుగుమ్మ కూడా కుర్ర కారును ఆకట్టుకుంటుంది. జబర్దస్త్ కమెడియన్ అజార్‌తో ప్రేమలో ఉన్నట్టు పలు స్కిట్లు కూడా చేశారు. వీరిద్దరూ మధ్య లవ్ ట్రాక్ కూడా నడిపించారు.
రీతూ చౌదరి గతంలో ఓ బిజినెస్ మాన్ అయిన శ్రీకాంత్‌ను వివాహం చేసుకోబోతుందని వార్తలు వచ్చాయి. హైదరాబాద్, బెంగళూరు నగరాలలో ఆయనకు చాలా ఆస్తులు ఉన్నాయి. అంతే కాకుండా ప్రస్తుతం రాజకీయాలలో కూడా బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయనతో దిగిన ఫోటోలను రీతూ చౌదరి స్పెషల్ వీడియాలో షేర్ చేయడంతో నాడు ఆమెకు విపరీతమైన పబ్లిసిటీ వచ్చింది.
కాగా.. ప్రస్తుతం విష్ణు ప్రియ, రీతూ చౌదరిలు థాయిలాండ్‌కు హాలీడేస్‌కు వెళ్లారు. అక్కడ ఇద్దరు కలిసి కొన్ని హాట్ ఫోటోలను షేర్ చేశారు. ముఖ్యంగా బీచ్ సైడ్‌లో ఇద్దరు కలిసి దిగిన ఫోటోలకు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. థాయిలాండ్ వేదికగా డబుల్ అందాలు అంటూ కొందరు నెటిజన్లు వారు షేర్ చేసిన ఫొటోలపై కామెంట్స్ చేస్తుండటం గమనార్హం.