విధాత: మాస్ కా దాస్ విశ్వక్సేన్ ప్రస్తుతం దాస్ కి ధమ్కీ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీని శాకుంతలం చిత్రంతో పోటీగా ఫిబ్రవరి 17న విడుదల చేయనున్నారు. ఇదే రోజున గీతా ఆర్ట్స్ వారి వినరో భాగ్యము విష్ణు కథ, సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ తొలిసారిగా తెలుగులో నటిస్తున్న సార్ చిత్రాలు విడుదల కానున్నాయి.
దాంతో విశ్వక్సేన్ కాస్త ముందడుగు వేశారు. సినిమా విడుదలకు ఇంకా నెల గ్యాప్ ఉండగానే సినిమా ట్రైలర్ విడుదల చేసి ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఈ సినిమాతో తనకు బిగ్ హిట్ కావాలి, అదేవిధంగా ఎన్నడూ లేని విధంగా మొదటిసారి తన అందాలను ఆరబోసిన నివేదా పేతురాజ్‌కు కూడా విజయం తప్పనిసరి.
అయితే ఈ చిత్రం మూవీ ట్రైలర్ రిలీజ్‌కి ముందు యాక్షన్ కింగ్ అర్జున్‌తో విశ్వక్సేన్కి వివాదం ఏర్పడింది. తన కూతురు ఐశ్వర్యను హీరోయిన్గా తెలుగుకు పరిచయం చేస్తూ అర్జున్ ఓ మూవీని మొదలుపెట్టారు. కానీ మనస్పర్ధల కారణంగా విశ్వక్సేన్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడు. అది వివాదానికి దారి తీసింది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఇలాంటి నటుడిని తన కెరీర్లోనే చూడలేదని యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమా ఆపేస్తున్నానని ఎమోషనల్ అయ్యారు.
ఈ వివాదంపై ప్రెస్‌మీట్ పెట్టిన విశ్వక్సేన్ తనకు అర్జున్ ఫ్రీడమ్ ఇవ్వలేదని, ఎంతసేపటికి తనను నమ్మమని చెబుతూ వచ్చారని ఏం జరుగుతుందో తెలియక పోవడంతో తాను ఫైనల్‌గా సినిమా నుంచి తప్పుకున్నానని తెలిపారు. మొత్తానికి తప్పేనని ఒప్పుకోవడంతో వివాదం సద్దుమణిగింది.
రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ ఇటీవల రచయితగా పనిచేసిన రవితేజ ధమాకా పెద్ద హిట్టు కొట్టింది. దాదాపు అదే కథను అటు ఇటుగా మార్చి దాస్‌కి దమ్కీ పేరుతో విశ్వక్సేన్ కు ఇచ్చాడనే ప్రచారం సాగుతోంది. ఇక ఈ మూవీలో విశ్వక్సేన్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహిస్తున్నారు. మొత్తానికి విశ్వక్సేన్ దమ్కీ చిత్రంతో విజయాన్ని అందిస్తాడో లేదో వేచి చూడాలి.