Vivek Venkataswamy | అవినీతిలో CM KCR టాప్-1..: వివేక్ వెంకటస్వామి
Vivek Venkataswamy అవినీతి బాగోతం బయటపెడతాం బిజెపి నాయకులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతిలో టాప్ వన్ లో ఉన్నాడని బిజెపి నాయకులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి విమర్శించారు. వరంగల్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. భారత రాష్ట్ర సమితి అవినీతి బాగోతం బయట పెడుతామని హెచ్చరించారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని విమర్శించారు. తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని ఆవేదన […]

Vivek Venkataswamy
- అవినీతి బాగోతం బయటపెడతాం
- బిజెపి నాయకులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతిలో టాప్ వన్ లో ఉన్నాడని బిజెపి నాయకులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి విమర్శించారు. వరంగల్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
భారత రాష్ట్ర సమితి అవినీతి బాగోతం బయట పెడుతామని హెచ్చరించారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని విమర్శించారు. తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో రైతులకు రుణామాఫీ చేయడం లేదన్నారు. పంట నష్టపోయిన వారికి రూ 10 వేలు ప్రకటించారు.. కానీ అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర తీసుకువచ్చిన భీమాను ఎందుకు అమలులోకి తీసుకురావడం లేదని ఆయన ప్రశ్నించారు. కౌలు రైతులను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందన్నారు.
కేంద్రం ఇస్తున్న సబ్సిడీతో రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయని అయినా బీఆర్ఎస్ నాయకులు ఈ విషయాన్ని చెప్పడం లేదన్నారు. కార్యక్రమంలో బిజెపి వరంగల్, హనుమకొండ జిల్లాల అధ్యక్షులు కొండేటి శ్రీధర్, రావు పద్మ, నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, డాక్టర్ విజయ్ చందర్ తదితరులు పాల్గొన్నారు.
