విధాత‌, ఢిల్లీ: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్‌రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. బెయిల్ ఇవ్వడానికి సరైన కారణాలు తమకు కనిపించడంలేదని, హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఈ దశలో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. శివశంకర్‌రెడ్డి తరపున కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ కౌన్సిల్ అభిషేక్‌ మనుసింఘ్వీ వాదనలు వినిపించారు. వివేకానందరెడ్డి హత్యకేసులో తొలుత దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌ (FIR)లో శివశంకర్ రెడ్డి పేరు లేదని ఆయన వాదించారు. […]

విధాత‌, ఢిల్లీ: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్‌రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. బెయిల్ ఇవ్వడానికి సరైన కారణాలు తమకు కనిపించడంలేదని, హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఈ దశలో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. శివశంకర్‌రెడ్డి తరపున కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ కౌన్సిల్ అభిషేక్‌ మనుసింఘ్వీ వాదనలు వినిపించారు.

వివేకానందరెడ్డి హత్యకేసులో తొలుత దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌ (FIR)లో శివశంకర్ రెడ్డి పేరు లేదని ఆయన వాదించారు. అప్రూవర్‌గా మారిన వాచ్‌మెన్ స్టేట్ మెంట్‌లో కూడా శివశంకరరెడ్డి పేరు లేదన్నారు. ఏ1 గా ఉన్న నిందితుడికి మూడు నెలల్లో బెయిల్ ఇచ్చారని, 11 నెలలు అవుతున్నా, ఎలాంటి సాక్ష్యాలు లేకపోయినా శివశంకర్‌రెడ్డికి బెయిల్ ఇవ్వడం లేదని న్యాయవాది విన్నవించారు. ప్రస్తుత పరిస్థితుల్లో… ఈ కేసులో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ… పిటిషన్‌ను తిరస్కరించింది.

అయితే.. ఇప్పటికే శివశంకర్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పును శివశంకర్‌రెడ్డి సవాల్ చేస్తూ.. సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై సోమవారం విచారణ జరిగింది. వాదనలు విన్న ధర్మాసనం ఈ మేరకు పిటిషన్ కొట్టివేసింది.

Updated On 26 Sep 2022 10:50 AM GMT
Somu

Somu

Next Story