Vivo T2 Pro విధాత‌: వివో టీ2 5జీ, వివో టీ2 ఎక్స్ 5జీ మోడ‌ళ్ల‌ను ఇప్ప‌టికే మార్కెట్‌లోకి తీసుకొచ్చి విజ‌య‌వంత‌మైన వివో సంస్థ టీ2 సిరీస్‌ను కొన‌సాగించనుంద‌ని తెలుస్తోంది. ఈ శ్రేణిలో వ‌స్తున్న టీ2 ప్రోను ఈ నెలాఖ‌రులో మార్కెట్‌లోకి తీసుకురానున్న‌ట్లు స‌మాచారం. దీనిపై ఇంకా స్ప‌ష్టత రావాల్సి ఉంది. అద్భుత‌మైన 3డీ వంపుల‌తో కూడిన డిస్‌ప్లేతో పాటు 120 హెర్జ్ రీఫ్రెష్ రేటుతో టీ2 ప్రో వ‌స్తున్న‌ట్లు వినికిడి. ఆప్టిక‌ల్ ఇమేజ్ స్టెబిలైజేష‌న్ సాంకేతిక‌త‌తో […]

Vivo T2 Pro

విధాత‌: వివో టీ2 5జీ, వివో టీ2 ఎక్స్ 5జీ మోడ‌ళ్ల‌ను ఇప్ప‌టికే మార్కెట్‌లోకి తీసుకొచ్చి విజ‌య‌వంత‌మైన వివో సంస్థ టీ2 సిరీస్‌ను కొన‌సాగించనుంద‌ని తెలుస్తోంది. ఈ శ్రేణిలో వ‌స్తున్న టీ2 ప్రోను ఈ నెలాఖ‌రులో మార్కెట్‌లోకి తీసుకురానున్న‌ట్లు స‌మాచారం.

దీనిపై ఇంకా స్ప‌ష్టత రావాల్సి ఉంది. అద్భుత‌మైన 3డీ వంపుల‌తో కూడిన డిస్‌ప్లేతో పాటు 120 హెర్జ్ రీఫ్రెష్ రేటుతో టీ2 ప్రో వ‌స్తున్న‌ట్లు వినికిడి. ఆప్టిక‌ల్ ఇమేజ్ స్టెబిలైజేష‌న్ సాంకేతిక‌త‌తో 64 మెగాపెక్సల్ సామ‌ర్థ్యంతో వెనుక కెమేరాతో ఇది రానుంది. ఈ కెమేరాతో 4కె వీడియోల‌ను కూడా షూట్ చేయొచ్చు.

మ‌రీ ముఖ్యంగా అతి నాజూగ్గా 7.4 మి.మీ. మందంతో టీ2 ప్రో ఉంటుంద‌ని టెక్ నిపుణులు చెబుతున్నారు. 8 జీబీ ర్యాం, 128 జీబీ మెమొరీ, 8 జీబీ ర్యాం, 256 జీబీ మెమొరీల‌తో టీ 2ప్రో రెండు మోడ‌ళ్లు అందుబాటులో ఉండ‌నున్నాయి. మీడియా టెక్ డైమ‌న్సిటీ 7200 ప్రాసెస‌ర్‌తో వ‌చ్చే ఈ మోడ‌ల్ ధ‌ర సుమారు రూ.23,999గా ఉండే అవ‌కాశ‌ముంది.

ఇప్పటికే ఉన్న వివో టీ2 5జీ, వివో టీ2ఎక్స్ 5జీ ఏప్రిల్ నుంచి వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి వ‌చ్చాయి. వివో టీ2 6జీబీ ర్యాం, 128 జీబీ వేరియంట్‌ను రూ.18 వేల‌కు విక్ర‌యిస్తుండ‌గా .. 4 జీబీ ర్యాం, 128 జీబీ మెమొరీ ఉన్న టీ2 ఎక్స్ రూ.12,999కు ల‌భిస్తోంది. ఈ రెండు మోడళ్లూ కూడా ఆండ్రాయిడ్ 13 ఫ‌న్ ట‌చ్ ఓఎస్‌తో ప‌ని చేస్తాయి.

Updated On 15 Sep 2023 9:22 AM GMT
somu

somu

Next Story