Saturday, April 1, 2023
More
    HomelatestCM Jagan l వైజాగ్ సదస్సు హిట్టేనా.. జగన్ స్కిట్ కొట్టినట్టేనా!

    CM Jagan l వైజాగ్ సదస్సు హిట్టేనా.. జగన్ స్కిట్ కొట్టినట్టేనా!

    Vizag conference, Jagan

    విధాత‌: ప్రతిపక్షాలు… వ్యతిరేక మీడియాలో ఎన్ని వార్తలు వచ్చిన గానీ విశాఖ పెట్టుబడుల సదస్సు హిట్ అయినట్లే అని జాతీయ మీడియా రిపోర్ట్.. దీంతో జగన్ స్కిట్ కొట్టినట్లే.. ప్రతిపక్షాలకు సౌండ్ లేనట్లే అని జగన్ క్యాంప్ సంబర పడుతోంది.. ఎంతసేపూ పథకాలు.. పంచడాలు తప్ప ఇంకేమి జగన్‌కు తెలియదని విమర్శించిన ప్రతిపక్షాలకు ఈ సదస్సుతో జగన్ సమాధానం ఇచ్చినట్లు అయింది.. జగన్ ప్రభుత్వం దెబ్బకు పరిశ్రమలు తరలిపోతున్నాయ్ అంటూ విపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని జగన్ విశాఖ సదస్సు వేదికగా తిప్పికొట్టారని అంటున్నారు.

    విశాఖ పెట్టుబడుల సదస్సును జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.. తన ఇంటి నుంచి కదలకుండా అంతా ఇంటినుంచే స్కెచ్ వేసి సభను సక్సెస్ చేసారన్నది ట్రేడ్ వర్గాల టాక్. మంత్రులు గుడివాడ అమర్నాథ్, బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డిలతో బాటు అధికారులు శ్రీలక్ష్మి, సృజన వంటి వారిని యాక్టివ్ గా ఉంచి దేశ వ్యాప్తంగా పర్యటనలు.. ప్రోగ్రామ్స్ చేయించి ఫైనల్‌గా భారీ సభను సక్సెస్ చేశారు.

    ఎన్నడూ బయటి సదస్సులకు రాని ముఖేష్ అంబానీ వంటివారు రావడం జగన్ సమర్థతకు నిదర్శనం.
    మొత్తంగా 13 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగినట్లు చెబుతున్నారు.. అందులో ఓ పావలా వంతు అమలైనా సరే పారిశ్రామిక రంగం గొప్ప సక్సెస్ సాధించినట్లే అని అంటున్నారు. సభ ఈస్థాయిలో జరగడంతో టిడిపికి సైతం సౌండ్ లేదని.. అందుకే వెతుక్కుని మరీ విమర్శలు చేస్తున్నారని అంటున్నారు.

    spot_img
    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular