Sunday, December 4, 2022
More
    Homelatestమెగాస్టార్‌ ‘వాల్తేరు వీరయ్య’ vs వైజాగ్ రంగారావు!

    మెగాస్టార్‌ ‘వాల్తేరు వీరయ్య’ vs వైజాగ్ రంగారావు!

    విధాత, సినిమా: మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ‘గాడ్‌ఫాదర్’ చిత్రం విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. ఈ సినిమా కోసం చిరంజీవి ఎంతగా ఎఫర్ట్ పెట్టారో.. ఈ మధ్య కాలంలో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలు చూస్తే తెలిసిపోతుంది. ‘ఆచార్య’ ఫ్లాప్‌తో అలెర్ట్ అయిన చిరంజీవి ‘గాడ్‌ఫాదర్’‌ సక్సెస్ కోసం అహర్నిశలు శ్రమించినట్లుగా ఆయన మాటలు వింటుంటే అర్థమవుతోంది.

    ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా అందింది కాబట్టి.. చిరు ఇప్పుడు తన తదుపరి సినిమాపై ఫోకస్ పెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఆయన హీరోగా.. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘మెగా154’ సినిమాను సంక్రాంతి బరిలో దించేందుకు చిరు సిద్ధమవుతున్నారు. ఆ సినిమాకు సంబంధించిన హడావుడి అంతా దీపావళి నుంచి మొదలు కాబోతున్నట్లుగా అధికారికంగా మేకర్స్ ప్రకటించారు.

    మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో రూపొందుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్నట్లుగా తెలుపుతూ.. దీపావళికి టైటిల్, టీజర్‌ని విడుదల చేయబోతున్నట్లుగా శుక్రవారం అధికారికంగా మేకర్స్ తెలియజేశారు.

    అయితే ఈ సినిమాకు ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ కన్ఫర్మ్ చేసినట్లుగా మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే లీక్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. దీంతో పాటే డబ్బింగ్ కార్యక్రమాలు కూడా మొదలెట్టారు. ఇక ఈ సినిమాకు సంబంధించి బాగా వైరల్ అవుతున్న వార్త ఏమిటంటే.. ఇందులో రవితేజ పాత్ర చాలా ఢిపరెంట్‌గా ఉండబోతుందట.

    చిరంజీవి, రవితేజ ఇందులో అన్నదమ్ములుగా కనిపిస్తారు కానీ.. చిరంజీవి తండ్రి రెండో భార్యకి జన్మించిన కుమారుడిగా రవితేజ ఇందులో కనిపిస్తారనేలా ఇప్పటికే వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు రవితేజ పాత్రకి సంబంధించి మరికొన్ని విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చిరంజీవి ఇందులో ‘వాల్తేరు వీరయ్య’గా కనిపిస్తే.. వైజాగ్ రంగారావుగా రవితేజ ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు.

    అంతేకాదు.. వీరయ్యని రంగారావు ముప్పుతిప్పులు పెడతాడని.. అయినా వీరయ్య రంగారావుకు చిక్కకుండా ఉంటాడనేలా టాక్ నడుస్తుంది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటూనే.. ఎంటర్‌టైనింగ్‌గా ఉంటాయనేలా చిత్ర బృందం సైతం మాట్లాడుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మరి ఇది ఇంత వరకు నిజమనేది ఈ దీపావళికి వచ్చే టీజర్‌తో తెలిసిపోతుంది. అదే నిజమైతే మాత్రం సంక్రాంతికి ఇంకో హిట్ చిరు ఖాతాలో పడినట్లే. చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular

    You cannot copy content of this page