విధాత: ప్రజాస్వామ్యానికి పునాది “ఓటు” అని సమాజంలో, 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు కోసం వెంటనే దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి యువత కు పిలుపునిచ్చారు.
సూర్యాపేట జూనియర్ కళాశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా యువతను ఉద్దేశించి మాట్లాడారు. ప్రపంచ గతిని మార్చగల శక్తి ఓటుకు ఉందన్నారు. ఒక వ్యక్తి అస్తిత్వాన్ని గుర్తించి, వ్యవస్థ మార్పునకు నాంది పలికేదే ఓటు అని అన్నారు.
మీకు ఇష్టమైన వ్యక్తిని ఎన్నుకోవాలంటే 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్క యువత ఓటు అనే ఆయుధాన్ని కలిగి ఉండాలని కోరారు.