విధాత: VRS  తీసుకోవడానికి తొందర ఏమి లేదని ముందుగా డీవోపీటీ ఆదేశాల మేరకు ఏపీ సీఎస్ ను కలిసి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చేందుకు విజయవాడ ఏపీ సచివాలయానికి వచ్చినట్లు మాజీ సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. ఒక ఐఏఎస్ అధికారిగా హోదా చిన్నదా పెద్దదా అని కాదని అధికారిగా బాధ్యతలు నిర్వర్తించాల్సిందేనన్నారు. EX. TS CS.. AT AP pic.twitter.com/GOsUfwvKaR — vidhaathanews (@vidhaathanews) January 12, 2023 ఏపీ సీఎస్‌ని కలిసి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చాక […]

విధాత: VRS తీసుకోవడానికి తొందర ఏమి లేదని ముందుగా డీవోపీటీ ఆదేశాల మేరకు ఏపీ సీఎస్ ను కలిసి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చేందుకు విజయవాడ ఏపీ సచివాలయానికి వచ్చినట్లు మాజీ సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. ఒక ఐఏఎస్ అధికారిగా హోదా చిన్నదా పెద్దదా అని కాదని అధికారిగా బాధ్యతలు నిర్వర్తించాల్సిందేనన్నారు.

ఏపీ సీఎస్‌ని కలిసి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చాక , ఏపీ సీఎంను కలిశాక ఏమి చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటానన్నారు. వీఆర్ఎస్‌పై తొందర లేదని, కుటుంబ సభ్యులతో, స్నేహితులతో చర్చించాకా భవిష్యత్ పై నిర్ణయం తీసుకుంటానన్నారు.

ఒక అధికారిగా డీఓపీటీ ఆదేశాలు పాటించి ఏపీలో రిపోర్ట్ చేయడం జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా పనిచేసే విషయమై ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.

Updated On 12 Jan 2023 6:04 AM GMT
krs

krs

Next Story