విధాత: వాస్తవానికి సినిమా అనేది కొన్ని వందల మంది కలిసి పనిచేసే సమష్టి కృషి. అదో టీం వ‌ర్క్‌. కానీ అది నేడు కేవలం స్టార్ హీరోలకు మాత్రమే పేరు తెస్తుంది. వారి ఇమేజ్ ని క్రేజీను పెంచుతుంది. తద్వారా వారికి వచ్చే రెమ్యూనరేషన్ రెండుమూడింతలు చేస్తోంది. కానీ అదే సమయంలో స్టార్ హీరోలకు దీటుగా ఓ సినిమా బాగా రావడానికి కష్టపడే సినీ కార్మికులకు మాత్రం ఎలాంటి క్రెడిట్ దక్కదు. వాళ్లకి ఇచ్చే రోజువారీ జీతం […]

విధాత: వాస్తవానికి సినిమా అనేది కొన్ని వందల మంది కలిసి పనిచేసే సమష్టి కృషి. అదో టీం వ‌ర్క్‌. కానీ అది నేడు కేవలం స్టార్ హీరోలకు మాత్రమే పేరు తెస్తుంది. వారి ఇమేజ్ ని క్రేజీను పెంచుతుంది. తద్వారా వారికి వచ్చే రెమ్యూనరేషన్ రెండుమూడింతలు చేస్తోంది.

కానీ అదే సమయంలో స్టార్ హీరోలకు దీటుగా ఓ సినిమా బాగా రావడానికి కష్టపడే సినీ కార్మికులకు మాత్రం ఎలాంటి క్రెడిట్ దక్కదు. వాళ్లకి ఇచ్చే రోజువారీ జీతం సరిపోదనే చెప్పాలి. వారు ఎంతో కష్టపడితే గాని ఓ సినిమా బాగా రాదనేది వాస్తవం.

సినిమా తెర వెనుక ఉండేవారు మాత్రం పేరుకు గాని ఆర్థికంగా గాని రాణించలేకపోతున్నారు. మహా అయితే ఇటీవల కాస్త డైరెక్టర్లకు కూడా క్రెడిట్ వస్తోంది. మొత్తం మీద ఒక సినిమా అంటే మనకు నలుగురు ఐదుగురి మీదే ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. హీరో, హీరోయిన్, దర్శకుడు, సంగీత దర్శకుడు, నిర్మాత. మిగతా వారి గురించి మనం పట్టించుకోము. ఇక వాల్తేరు వీరయ్య విషయాన్ని కొస్తే ఈ చిత్రానికి అత్యద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

దాంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. కాగా ఈ సినిమా షూటింగ్ సమయంలో మూవీ టీం పడ్డ కష్టాలను మెగాస్టార్ చిరంజీవి ఓ షార్ట్ వీడియో రూపంలో విడుదల చేశారు. ఈ వీడియోను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసే చిరంజీవి సినీ కార్మికులకు తన కృతజ్ఞతలు తెలిపాడు.

మేమంతా సినీ కార్మికులం.. నిరంతర శ్రామికులం.. కళామతల్లి సైనికులం.. మేమంతా సినిమా ప్రేమికులం.. సినిమానే మా కులం.. మా గమ్యం మిమ్మల్ని అలరించడం.. ఇంతటి అంకితభావంతో పనిచేస్తున్న ప్రతి ఒక్క సినీ కార్మికుడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరి వ‌లనే వాల్తేరు వీరయ్యకు విజయం సాధ్యమైంది అంటూ చిరు ఎమోషనల్ నోట్ తో యూనిట్ కు ధన్యవాదాలు తెలియజేశాడు.

ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ కు తాను రుణపడి ఉంటాన‌ని తెలిపాడు. దాంతో చిరంజీవి పోస్ట్ చేసిన ఈ స్పెషల్ ఎమోషనల్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.

Updated On 15 Jan 2023 9:05 AM GMT
krs

krs

Next Story