విధాత: అఖండ చిత్రానికి ముందు నందమూరి బాలకృష్ణ మార్కెట్ 30, 35 కోట్లుగా ఉండేది. కానీ అఖండ చిత్రం తర్వాత విడుదలైన వీరసింహారెడ్డి చిత్రం 75 కోట్ల బిజినెస్ చేసింది. దానికి తగ్గట్టుగానే ఈ చిత్రం విడుదలైన 12వ తారీకు అత్యద్భుత కలెక్షన్లను వసూలు చేసింది. దాంతో బాలయ్యకు సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, అఖండాల తర్వాత మరో బ్లాక్ బస్టర్ వచ్చిందని అభిమానులు ఆనందపడ్డారు. కానీ ఆనందం కేవలం ఒకటి రెండు రోజులకే పరిమితమైంది. ఆ పక్క రోజే […]

విధాత: అఖండ చిత్రానికి ముందు నందమూరి బాలకృష్ణ మార్కెట్ 30, 35 కోట్లుగా ఉండేది. కానీ అఖండ చిత్రం తర్వాత విడుదలైన వీరసింహారెడ్డి చిత్రం 75 కోట్ల బిజినెస్ చేసింది. దానికి తగ్గట్టుగానే ఈ చిత్రం విడుదలైన 12వ తారీకు అత్యద్భుత కలెక్షన్లను వసూలు చేసింది. దాంతో బాలయ్యకు సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, అఖండాల తర్వాత మరో బ్లాక్ బస్టర్ వచ్చిందని అభిమానులు ఆనందపడ్డారు.

కానీ ఆనందం కేవలం ఒకటి రెండు రోజులకే పరిమితమైంది. ఆ పక్క రోజే వాల్తేరు వీరయ్య గా చిరంజీవి వచ్చి రఫ్ఫాడిస్తూ ఉండడంతో వీరసింహారెడ్డి పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా మారింది. వీర సింహారెడ్డికి కేవలం మాస్ ఆడియన్స్, పక్కా తెలుగుదేశం అభిమానుల నుంచి మాత్రమే ఆదరణ లభిస్తుంది. కానీ వాల్తేరు వీరయ్యను ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ చిత్రం కూడా మాస్ మసాలా చిత్రమే అయినప్పటికీ ఇందులోని కామెడీ ఎంటర్టైన్మెంట్ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ధియేట‌ర్ల‌కు వ‌చ్చేలా చేస్తోంది. ఇది ఈ చిత్రానికి కలిసి వ‌చ్చింద‌ని చెప్పాలి. దాంతో చిరంజీవి మరోసారి బాక్సాఫీస్ వద్ద కొదమ సింహంలా తన జూలు విదిలించాడు. ఈ దాటికి వీర సింహారెడ్డి తట్టుకోలేకపోతున్నాడు.

ఇప్పటికే పలు థియేటర్లలో వీరసింహారెడ్డికి బదులుగా వాల్తేరు వీరయ్యను వేస్తున్నారు. దాంతో వీరసింహారెడ్డి థియేటర్ల సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది. సంక్రాంతి పండుగలను ఉన్నంతకాలం వాల్తేరు వీరయ్య హ‌వా తగ్గేలా కనిపించడం లేదు. చిరు మేనియా కొనసాగుతోంది. దాంతో బాలయ్య సినిమాకు ఈసారి భారీ నష్టాలు తప్పవని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

ఒక్క సీడెడ్ లో మినహా తెలంగాణ, ఆంధ్ర, ఉత్తరాంధ్రలలో వాల్తేరు వీరయ్యదే పైచేయిగా ఉంది. మొత్తానికి మైత్రి సంస్థ వారికి వాల్తేరు వీరయ్య గుడ్ న్యూస్ గా ఉండగా వీర సింహారెడ్డి మాత్రం కాస్త బ్యాడ్ న్యూస్ గా మిగిలితుందని చెప్పాలి..!

Updated On 15 Jan 2023 8:56 AM GMT
krs

krs

Next Story