విధాత: తెలుగు ప్రేక్షకులకు రోహిత్ పాఠక్ చిన్న చిన్న వేషాలు, విలన్ పాత్రల‌ ద్వారా పరిచయం. తేజా దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా వచ్చిన ‘సీత’, నితిన్ -చంద్రశేఖర్ ఏలేటి కాంబినేషన్‌లో వచ్చిన ‘చెక్’, గోపీచంద్ హీరోగా వచ్చిన ‘సిటీమార్’, కార్తీ హీరోగా వచ్చిన ‘ఖాకీ’, రామ్ నటించిన ‘ది వారియర్’ వంటి చిత్రాలలో ఆయన కొన్ని పాత్రలు చేశారు. తాజాగా ఆయన వాల్తేరు వీరయ్యలో ఓ పాత్రను చేస్తున్నాడు. ఈ పాత్ర గురించి […]

విధాత: తెలుగు ప్రేక్షకులకు రోహిత్ పాఠక్ చిన్న చిన్న వేషాలు, విలన్ పాత్రల‌ ద్వారా పరిచయం. తేజా దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా వచ్చిన ‘సీత’, నితిన్ -చంద్రశేఖర్ ఏలేటి కాంబినేషన్‌లో వచ్చిన ‘చెక్’, గోపీచంద్ హీరోగా వచ్చిన ‘సిటీమార్’, కార్తీ హీరోగా వచ్చిన ‘ఖాకీ’, రామ్ నటించిన ‘ది వారియర్’ వంటి చిత్రాలలో ఆయన కొన్ని పాత్రలు చేశారు.

తాజాగా ఆయన వాల్తేరు వీరయ్యలో ఓ పాత్రను చేస్తున్నాడు. ఈ పాత్ర గురించి బాలీవుడ్ నటుడైన రోహిత్ పాఠక్ తన తాజా ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు. చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ఇందులో ఆయన కీలకపాత్రలో క‌నిపించ‌నున్నాడు. ప్రముఖ మీడియా ఛానల్‌తో మాట్లాడిన ఆయ‌న తన పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.

నేను మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో ప్రతి నాయకుడి పాత్రలో కనిపించాను. చిరంజీవి మొదటి పోరాట సన్నివేశం నుంచే నా పాత్ర మలుపు తిరుగుతుంది. సముద్రంపై ఆధిపత్యం చెలాయిస్తుంటాను. ఒక రకంగా చెప్పాలంటే సముద్రానికి రాజును. ఈ సినిమాలో నాది బంగ్లాదేశ్. తీర ప్రాంతం గురించి బాగా తెలిసిన వ్యక్తిని. చిరంజీవి పరిచయ సన్నివేశంలో నేను భాగమవుతాను. నాకు హీరోకు మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని అన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ తెలుగులో బాలకృష్ణ చిరంజీవి ఇద్దరు టాప్ హీరోలు. సంక్రాంతికి వారి చిత్రాలు ఒకేసారి విడుదలవుతున్నాయి. ఇద్దరు నటించిన సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఇద్దరూ సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచి వాళ్లకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నాకు తెలిసి తెలుగు రాష్ట్రాలలోని మాస్ ప్రేక్షకులు సంక్రాంతి పండగల‌లో వీరి సినిమాల కోసం ఎదురు చూస్తుంటారని తెలిపారు.

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, శృతిహాసన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్న వాల్తేరు వీరయ్య చిత్రం సంక్రాంతి కానుకగా ఈనెల 13న థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో చిరు మళ్లీ ముఠామేస్త్రి నాటి ఊర‌మాస్ లుక్‌లో కనిపిస్తుండడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Updated On 10 Jan 2023 2:04 AM GMT
krs

krs

Next Story