Warangal
- ధాన్యం కొనుగోలు తీరు, రైస్ మిల్ పరిశీలన
- మిల్లు సిబ్బంది పై వరంగల్ సీపీ రంగనాథ్ ఆగ్రహం
- చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కమలాపూర్ మండలంలోని గూడూరు గ్రామ శివారులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి.రంగనాథ్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు.
ఈ సంధర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రంలోని ధాన్యాన్ని పోలీస్ కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో పాటు పి.పి.సి కేంద్రంకు ధాన్యం తీసుకు వచ్చిన రైతులతో పోలీస్ కమిషనర్ ముచ్చటించారు. ధాన్యం కొనుగోలు సమయంలో తీస్తున్న తరుగు వివరాలను పోలీస్ కమిషనర్ రైతులను ఆడిగి తెలుసుకోగా.. ప్రభుత్వం నిబంధనలకు వ్యతిరేకంగా అధిక మొత్తంలో తరుగు పేరుతో రైస్ మిల్లర్ దోపిడీకి పాల్పడుతున్నట్లుగా రైతులు పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసారు.
రైతులు ఇచ్చిన ఫిర్యాదుతో ముచ్చర్ల నాగారం క్రాస్ రోడ్ వద్ద వున్న సప్తగిరి రైస్ మిల్లును పోలీస్ కమిషనర్ టాస్క్ ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్ , స్ధానిక పోలీస్ అధికారులతో కల్సి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీల్లో ధాన్యం తూకం సమయంలో రైస్ మిల్ యాజమాన్యం రసీదు లపై నమోదు చేసిన తూకం వివరాలు, తరుగు వివరాలను పరిశీలించి రైస్ మిల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు రైస్ మిల్లు పై చట్టపరమైన చర్యలు తీసుకోవలసిందిగా పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులను ఆదేశించారు.