Warangal
- మృతుడు కేసముద్రం మాజీ జెడ్పీటీసీ
- కాంగ్రెస్ నాయకుడు వేం సోదరుడు
- నుజ్జునుజ్జు అయిన కారు
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ జిల్లా గీసుగొండ మండలం గంగదేవిపల్లి సమీపంలో శనివారం కారు, బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో కేసముద్రం మాజీ జెడ్పీటీసీ వేం పురుషోత్తంరెడ్డి అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయిపోయింది. దీంతో కారు నడుపుతున్న కేసముద్రం మాజీ జెడ్పీటీసీ పురుషోత్తంరెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డికి పురుషోత్తంరెడ్డి స్వయాన పెద్దన్న.