Warangal | కేసీఆర్ పై బీజేపీ నేత కుసుమ సతీష్ బాబు ఫైర్ వరంగల్, ఖమ్మం హైవేపై రాస్తారోకో విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: అన్నం పెట్టే రైతన్నకు సున్నం పెట్టే కేసీఆర్ కు రానున్న ఎన్నికల్లో ఓటుతో తగిన బుద్ధి చెప్తారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కుసుమ సతీష్ బాబు హెచ్చరించారు. రైతు బంధు పథకంతో కేసీఆర్ గారడీ వేషాలను రైతులు ఎప్పుడో గ్రహించారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ […]

Warangal |
- కేసీఆర్ పై బీజేపీ నేత కుసుమ సతీష్ బాబు ఫైర్
- వరంగల్, ఖమ్మం హైవేపై రాస్తారోకో
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: అన్నం పెట్టే రైతన్నకు సున్నం పెట్టే కేసీఆర్ కు రానున్న ఎన్నికల్లో ఓటుతో తగిన బుద్ధి చెప్తారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కుసుమ సతీష్ బాబు హెచ్చరించారు. రైతు బంధు పథకంతో కేసీఆర్ గారడీ వేషాలను రైతులు ఎప్పుడో గ్రహించారని అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ శనివారం కిషన్ మోర్చా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. వరంగల్-ఖమ్మం హైవే నాయుడు పంపు సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. హైవేపై ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా సతీష్ బాబు మాట్లాడుతూ, కేసీఆర్ ఎన్నికల హామీలో ఇచ్చిన రైతు రుణమాఫీ ఏకకాలంలో చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ ఫసల్ బీమా యోజనను రాష్ట్రంలో అమలు చేయాలని కోరారు. తప్పులతడకగా ఉన్న ధరణి పోర్టల్ ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
నిరసనలో కిషన్ మోర్చా ఉపాధ్యక్షులు మల్లాడి తిరుపతిరెడ్డి, జిల్లా అధ్యక్షులు బెజ్జంగి శేషాద్రి, ప్రధాన కార్యదర్శి బైరి నాగరాజు, జిల్లా నాయకులు కొండేటి శ్రీధర్, మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ మార్తినేని ధర్మారావు, మాజీ ఎంపీటీసీ జలగం రంజిత్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బన్న ప్రభాకర్, నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, గంట రవికుమార్, నాయకులు అశోక్ పాల్గొన్నారు.
