Warangal త్వరలోనే ఇండ్ల స్థలాల సమస్య పరిష్కరిస్తాం ప్రెస్ క్లబ్ అభినందన సభలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, త్వరలోనే జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. బుధవారం హనుమకొండ బాలసముద్రంలోని ప్రెస్ క్లబ్ ఆవరణలో నూతనంగా గెలుపొందిన వరంగల్ ప్రెస్ క్లబ్ కార్యవర్గానికి టీయూడబ్ల్యూజేే […]

Warangal

  • త్వరలోనే ఇండ్ల స్థలాల సమస్య పరిష్కరిస్తాం
  • ప్రెస్ క్లబ్ అభినందన సభలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, త్వరలోనే జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. బుధవారం హనుమకొండ బాలసముద్రంలోని ప్రెస్ క్లబ్ ఆవరణలో నూతనంగా గెలుపొందిన వరంగల్ ప్రెస్ క్లబ్ కార్యవర్గానికి టీయూడబ్ల్యూజేే (ఐజేయు) అధ్వర్యంలో అభినందన సభ జరిగింది.

ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మాట్లాడుతూ ఎంతో కాలంగా జర్నలిస్టులు ఎదురు చూస్తున్న ఇండ్ల స్థలాల సమస్యను తెలంగాణ దశాబ్ది ఉత్సవాల లోపే అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. హనుమకొండ ఉమ్మడి వరంగల్ జిల్లాకు కేంద్రంగా ఉండడం వల్ల మీడియాకు చెందిన అత్యధికులు తన నియోజకవర్గంలోనే ఉన్నారని,అందరికీ ఇండ్ల స్థలాలు అందించేందుకు ప్రెస్ క్లబ్, జర్నలిస్టుల సొసైటీల సహకారంతో ముందుకు సాగుతామన్నారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో ఇక్కడి జర్నలిస్టుల పాత్ర మరువలేనిదని, తాను మొదటి నుండి జర్నలిస్టుల పక్షపాతినేనని అన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని, జర్నలిస్టుల సమస్యలను కూడా తప్పక పరిష్కరిస్తామని, అందుకు యూనియన్ లు కూడా సహకరించాలని కోరారు.

వర్ధన్నపేట ఎమ్మెల్యే, వరంగల్ జిల్లా బీఆర్ఎస్ అధ్య‌క్షుడు ఆరూరి రమేష్ మాట్లాడుతూ తన నియోజకవర్గంలో ఇప్పటికే పలు మండలాలలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు అందించామని, మిగిలిన మండలాలలో కూడా ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. నగరంలో పనిచేస్తున్న జర్నలిస్టుల కోసం తన నియోజకవర్గం పరిధిలో భూమిని గుర్తించడం కూడా జరిగిందని, త్వరలోనే దానికి కార్యరూపం రానుందని అన్నారు.

సంక్షేమానికి ప్రెస్ క్లబ్‌లు కృషి చేయాలి

ఇండియన్ జర్నలిస్టు యూనియన్ జాతీయ అద్యక్షులు కె. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా తమ యూనియన్ ఆధ్వ‌ర్యంలో అన్ని జిల్లా కేంద్రాలలో ప్రెస్ క్లబ్ లను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, ప్రెస్ క్లబ్ లు రిక్రియేషన్ క్లబ్ లుగా ఉంటూనే జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయాలని సూచించారు. వరంగల్ ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టులకు అందుబాటులో ఉండే విధంగా డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలని కోరారు.

సిఎం కేసిఆర్ జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు అందించాలని కోరారు. కేవలం వృత్తినే నమ్ముకుని పని చేస్తున్న జర్నలిస్టులను ఆత్మ గౌరవంతో జీవించేలా వారి సంక్షేమానికి కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అద్యక్షులు వేముల నాగరాజు, ప్రధాన కార్యదర్శి బొల్లారపు సదయ్య లతో పాటు కార్యవర్గాన్ని మెమెంటో, శాలువాలతో ప్రజాప్రతినిధులు, యూనియన్ నాయకులు ఘనంగా సన్మానించారు. అలాగే టీఎన్జీవో, టిజివో, ఉద్యోగ, ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థల ఆద్వర్యంలో ప్రెస్ క్లబ్ కార్యవర్గానికి సన్మానం చేశారు.

ఈ కార్యక్రమానికి టీయూడబ్ల్యూజేే (ఐజేయు) జిల్లా అధ్య‌క్షుడు గడ్డం రాజిరెడ్డి అధ్యక్షత వహించగా వరంగల్ మేయర్ గుండు సుధారాణి, వరంగల్ ఎంపి పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవిందర్ రావు, ఏపి ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, టీయూడబ్ల్యూజేే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, జాతీయ రాష్ట్ర నాయకులు దాసరి క్రిష్ణా రెడ్డి, కె. సత్యనారాయణ, రాజేష్, బాబు, గాడిపెల్లి మధు,వల్లాల వెంకట రమణ, గుంటి విద్యాసాగర్, జిల్లా ప్రదాన కార్యదర్శి తోట సుధాకర్, వరంగల్ జిల్లా అద్యక్ష, కార్యదర్శులు రాంచందర్, దుర్గా ప్రసాద్, నాయకులు కంకనాల సంతోష్, సంగోజు రవి, రంగనాథ్, రజినీకాంత్, బుచ్చిరెడ్డి, కె. రవిందర్ రెడ్డి, నార్లగిరి యాదగిరి, సాగర్ తదితరులు పాల్గొన్నారు.

వ‌రంగ‌ల్ ప్రెస్ క్ల‌బ్ కార్య‌వ‌ర్గానికి మంత్రి ఎర్ర‌బెల్లి అభినంద‌న‌

ఇటీవ‌ల ఎన్నికై, బుధవారం అభినంద‌న స‌న్మానాన్ని అందుకుంటున్న వ‌రంగ‌ల్ ప్రెస్ క్ల‌బ్ కార్య‌వ‌ర్గానికి రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు శుభాకాంక్ష‌లు, అభినంద‌న‌లు తెలిపారు. హ‌న్మ‌కొండ‌లోని వ‌రంగ‌ల్ ప్రెస్ క్ల‌బ్ ఆవ‌ర‌ణ‌లో ఈ స‌త్కార స‌భ జ‌రుగుతుండ‌గా, వివిధ కార్య‌క్ర‌మాల‌తో బిజీగా ఉన్న మంత్రి, ముందుగానే అక్క‌డ‌కు వెళ్ళి, కార్య‌వ‌ర్గాన్ని క‌లిశారు.

వారికి శుభాకాంక్ష‌లు, అభినంద‌న‌లు తెలిపారు. ప్రెస్ క్ల‌బ్ త‌మ స‌భ్యులైన జ‌ర్న‌లిస్టుల సంక్షేమానికి కృషి చేయాల‌ని ఆకాంక్షించారు. త‌న వంతుగా ప్రెస్ క్ల‌బ్ కు అవ‌స‌ర‌మైన స‌హాయ‌, స‌హ‌కారాలు అందిస్తామ‌ని హామీ ఇచ్చారు.

Updated On 24 May 2023 2:37 PM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story