లాభాల బాట… అవార్డుల పంట దళిత బంధు నగదు జమకు ప్రయత్నం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విధాత, వరంగల్: లాభాల బాటలో పయనిస్తూ, అవార్డులను పొందుతున్న వరంగల్ డిసిసి బ్యాంక్ రాష్ట్రంలో నెంబర్ వన్ గా అభివృద్ధి చెందాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆకాంక్షించారు. వరంగల్ డిసిసి బ్యాంక్ డైరీ ఆవిష్కరించిన అనంతరం మంత్రి ఎర్రబెల్లి మాట్లాడారు. మంత్రి మాటల్లోనే… ఈ బ్యాంక్ […]

  • లాభాల బాట… అవార్డుల పంట
  • దళిత బంధు నగదు జమకు ప్రయత్నం
  • మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

విధాత, వరంగల్: లాభాల బాటలో పయనిస్తూ, అవార్డులను పొందుతున్న వరంగల్ డిసిసి బ్యాంక్ రాష్ట్రంలో నెంబర్ వన్ గా అభివృద్ధి చెందాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆకాంక్షించారు.

వరంగల్ డిసిసి బ్యాంక్ డైరీ ఆవిష్కరించిన అనంతరం మంత్రి ఎర్రబెల్లి మాట్లాడారు. మంత్రి మాటల్లోనే… ఈ బ్యాంక్ చైర్మన్ గా పని చేసినందున పూర్తి అవగాహన ఉంది. ప్రజలకు, రైతులకు సేవ చేసేందుకు మంచి అవకాశం. బ్యాంక్ రికవరీలో చాలా ముందుంది. బ్యాంక్ అభివృద్ది కోసం పని చేసినందుకు అభినందిస్తున్నాను. ఇంకా ముందుకు తీసుకెళ్లాలి.

బ్యాంక్ మీద నమ్మకం కుదిరితే డిపాజిట్లు వస్తాయి. దళిత బంధు మొత్తం ఇందులో డిపాజిట్ చేసేలా కృషి చేస్తాను. వివిధ రకాల రుణాలతో ఎన్నో కుటుంబాలకు లాభం చేస్తున్నారు. రైతు కుటుంబాలకు అన్ని విధాల లోన్స్ ఇవ్వడం సంతోషం. కొత్త బ్రాంచీల కోసం లాండ్ ఇచ్చి, రోడ్లు మంజూరు చేస్తాం.

బ్యాంక్ సహకార స్ఫూర్తి గొప్పది: చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్

బ్యాంక్ అందించే సహకార స్ఫూర్తి గొప్పది. అసంఘటిత కార్మికులను ఏకం చేసి 60 సంఘాలు చేశాం. వారికి రుణాలు ఇవ్వాలి. గొప్ప చరిత్ర ఉన్న ఈ బ్యాంక్ నగర ప్రజలకు సహకారించాలి.

లాభాల బాటలో పయనింప‌జేస్తున్న మీకు మా సహకారం తప్పకుండా ఉంటుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. సహకార రంగానికి మంచి రోజులు వస్తున్నాయని డిసీసీ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు అన్నారు.

బ్యాంకు రుణాలివ్వడంతో పాటు, లాభాలు పెరిగాయని అన్నారు. ఎన్.పి. ఏలను 3 శాతం నుంచి 2 శాతం తగ్గించి రూ.20 కోట్ల లాభాల లక్ష్యంతో ఉన్నామని ప్రకటించారు. కార్యక్రమంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, రైతు రుణ విమోచనా కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకన్న, బ్యాంక్ డైరెక్టర్లు, రైతు సంఘాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Updated On 4 Jan 2023 11:40 AM GMT
krs

krs

Next Story