Warangal
- ఉమ్మడి వరంగల్‌లో వరుస ఘటనలు
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వీధి కుక్కల దాడులు వణికిస్తున్నాయి. వరుస దాడులతో జనం బెంబేలెత్తి పోతున్నారు. హన్మకొండ కాజీపేటలో వీధి కుక్కల దాడిలో పదేళ్ల బాలుడు చనిపోయిన ఘటన మరువకముందే.. మళ్ళీ కుక్కలు రెచ్చిపో యాయి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఆనేపురం వెంకయ్య తండా, మేఘ్య తండాలలో 14 మందిపై వీధి కుక్కలు దాడి చేశాయి.
గాయపడిన వారిలో కొందరు మహిళలు, కొందరు చిన్నపిల్లలు ఉన్నారు. కుక్క కాటుకు గురైన వారందరికి చికిత్స కోసం మరిపెడ పీహెచ్ సీ కి తరలించి చికిత్స అందించారు. ఇది ఇలా ఉండగా ఇటీవల గుంజేడు ముసలమ్మ జాతరలో రెండు రోజుల క్రితం 12 మంది పై కుక్కలు దాడి చేశాయి.