HomelatestWarangal | గౌరవెల్లి, గండిపెల్లి, శ్రీరామ్ సాగర్‌కు నిధులు కేటాయించాలి: చాడ

Warangal | గౌరవెల్లి, గండిపెల్లి, శ్రీరామ్ సాగర్‌కు నిధులు కేటాయించాలి: చాడ

Warangal

  • పోరాటం ఫలితమే ప్రాజెక్టుల ప్రారంభం
  • సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: గౌరవెల్లి, గండిపెల్లి, శ్రీరామ్ సాగర్ వరద కాలువ పథకాలకు వెయ్యి కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేసి రైతన్నను ఆదుకోవాలని సిపిఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం పల్లె పల్లెకు సీపీఐ కార్యక్రమంలో భాగంగా హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర, రంగయ్య పల్లి, మాణిక్యాపూర్, గాంధీ నగర్ గ్రామాల్లో పర్యటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికీ అనేక సంవత్సరాలు గడుస్తున్నా బీఆర్ఎస్ ప్రభుత్వం తక్కువ నిధులు కేటాయించడం వల్ల కాలువలు అసంపూర్తి నిర్మాణంలో ఉన్నాయన్నారు. ఈ ప్రాంత రైతన్న సాగునీటి కోసం ఎదురు చూస్తూ ఉన్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

గౌరవెల్లి, గండిపెల్లి, శ్రీరామ్ సాగర్ వరద కాలువ పథకం పోరాట ఫలితమే అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తపనపడే పార్టీ సిపిఐ అని చాడ అన్నారు. హుస్నాబాద్ ప్రాంతం పూర్తిగా మెట్ట ప్రాంతం కావడం వల్ల సిపిఐ పార్టీ దశాబ్దాల పోరాటాల ఫలితం వల్ల ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వచ్చి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంతంలో వరద కాలవ కోసం వలసబోతున్న ప్రజలను కూలీలను వారి కుటుంబాలను ఆదుకోవాలని అప్పటి మాజీ ఎమ్మెల్యే లు.. దుగ్గిరాల వెంకట్రావు.. దేశిని చిన్న మల్లయ్య.. చెన్నమనేని రాజేశ్వరరావుతోపాటు సిపిఐ కరీంనగర్ ఉమ్మడిజిల్లా నాయకత్వం పోరాటాల ఫలితంగా.. శ్రీరామ్ సాగర్ వరద కాలువ, గౌరవెల్లి, గండేపల్లి ప్రాజెక్టులు వచ్చాయన్నారు.

ప్రజా సంక్షేమానికి కృషి చేయాలి

ప్రభుత్వ రంగ సంస్థలు.. జాతీయం చేసి అన్ని వర్గాలకు సంక్షేమ పథకాల అమలు చేయాలని, విద్యా వైద్యం, ఉపాధి మార్గాలను అందించాలని చాడ కోరారు. రైతులకు. వ్యవసాయ కూలీలకు అండగా ఉండాల్సిన కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ధ్వంసం చేస్తూ కార్పొరేట్ పెట్టుబడిదారులకు అమ్మే విధంగా ప్రోత్సహించడాన్ని కేంద్ర ప్రభుత్వం తన విధానంగా కొనసాగిస్తుందన్నారు. మరొక పక్క నిత్యావసర ధరలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు కూరగాయలు సామాన్యుడు కొనలేని పరిస్థితి ఎదురైందన్నారు.

కేంద్ర ప్రభుత్వం మతతత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తూ లౌక్యరాజ్యాన్ని తూట్లు పొడిచే విధంగా మను వాద సిద్ధాంతాన్ని ఆర్ఎస్ఎస్ విధానాలను కొనసాగిస్తుందన్నారు. భారత రాజ్యాంగానికి విగాథమని చూస్తూ ఊరుకోలేమన్నారు. భారత రాజ్యాంగం కాపాడేందుకు, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు కమ్యూనిస్టు కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులు శక్తివంచన‌ లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. బిజెపి హఠావో దేశ్ కి బచావో నినాదాన్ని సిపిఐ దేశవ్యాప్తంగా ప్రజలను చైతన్యం చేస్తుందన్నారు.

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కలపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ మే 15న హుస్నాబాద్ లో జరిగే బహిరంగ సభ ను వేలాది మంది తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారం కోసం ముందు నుండి పోరాడే పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని రానున్న ఎన్నికల్లో సిపిఐ పార్టీని ఆదరించాలని వారు కోరారు.

శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రే బిక్షపతి, రాష్ట్ర సమితి సభ్యులు ఆదర్ శ్రీనివాస్, డి హెచ్ పి ఎస్ . రాష్ట్ర కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్, మహిళా సంఘం జిల్లా కార్యదర్శి మంచాల రమాదేవి, తిరుపతి, ఆదరి రమేష్, రావుల తిరుపతి, కిషన్, కుమారస్వామి, పొన్నాల నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular