Warangal | కేజీల్లో బంగారు, వజ్రాల అభరణాలు, డబ్బులు స్వాధీనం వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఘజియాబాద్ అంతర్ రాష్ట్ర దొంగల ముఠా ఎట్టకేలకు పోలీసులకు పట్టబడ్డారు. బుధవారం వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ కేసు వివరాలను వెల్లడించారు. ఈ ముఠా అపార్ట్మెంట్లలో తాళం వేసి వున్న ఇండ్లను లక్ష్యంగా చేసుకొని చోరీలు, గంజాయి విక్రయాలకు పాల్పడ్డారు. నలుగురు సభ్యులు ఉన్న ఘజియాబాద్ అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను […]

Warangal |
- కేజీల్లో బంగారు, వజ్రాల అభరణాలు, డబ్బులు స్వాధీనం
- వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఘజియాబాద్ అంతర్ రాష్ట్ర దొంగల ముఠా ఎట్టకేలకు పోలీసులకు పట్టబడ్డారు. బుధవారం వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ కేసు వివరాలను వెల్లడించారు.
ఈ ముఠా అపార్ట్మెంట్లలో తాళం వేసి వున్న ఇండ్లను లక్ష్యంగా చేసుకొని చోరీలు, గంజాయి విక్రయాలకు పాల్పడ్డారు. నలుగురు సభ్యులు ఉన్న ఘజియాబాద్ అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను సీసీఎస్, మట్టెవాడ, సుబేదారి, హనుమకొండ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు.
వీరి నుంచి రెండు కోట్ల విలువైన సుమారు 2 కిలోల 380 గ్రాముల బంగారు, వజ్రాల అభరణాలు, ఐదు లక్షల 20 వేల రూపాయల విలువైన 14 గంజాయి ప్యాకెట్లతో పాటు ఒక పిస్టల్, ఐదు రౌండ్లు, కారు, నాలుగు సెల్ఫోన్లు, రెండు వాకీటాకీలు, నాలుగు నకిలీ అధార్కార్డులు, ఐదువేల రూపాయల నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ కు చెందిన అక్బర్ ఖురేషి, మహమ్మద్ షరీఫ్, ఎండీ జాద్ ఖాన్, మీరట్ జిల్లాకు చెందిన కపిల్ జాటోవు ఉన్నారు.
