warangal ఆసియా ఖండంలోనే అతిపెద్ద చర్చి విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: హ‌నుమ‌కొండ జిల్లా పెద్ద పెండ్యాల క‌రుణాపురంలో ఆసియాలోనే అతిపెద్ద క్రీస్తు జ్యోతి చర్చిని శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా ఏసు భ‌క్తుల‌తో క‌లిసి మంత్రి చ‌ర్చీలో ప్రార్థ‌న‌లు చేశారు. చ‌ర్చీ పెద్ద‌లు, ఫాద‌ర్స్ అంతా క‌లిసి మంత్రి ఎర్ర‌బెల్లికి ఆశీర్వ‌చ‌నం అందించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి […]

warangal

  • ఆసియా ఖండంలోనే అతిపెద్ద చర్చి

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: హ‌నుమ‌కొండ జిల్లా పెద్ద పెండ్యాల క‌రుణాపురంలో ఆసియాలోనే అతిపెద్ద క్రీస్తు జ్యోతి చర్చిని శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా ఏసు భ‌క్తుల‌తో క‌లిసి మంత్రి చ‌ర్చీలో ప్రార్థ‌న‌లు చేశారు. చ‌ర్చీ పెద్ద‌లు, ఫాద‌ర్స్ అంతా క‌లిసి మంత్రి ఎర్ర‌బెల్లికి ఆశీర్వ‌చ‌నం అందించారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి మాట్లాడుతూ హ‌నుమ‌కొండ జిల్లా పెద్ద పెండ్యాల క‌రుణాపురం క్రీస్తు జ్యోతి చర్చి ప్రారంభోత్స‌వానికి అనేక ప్రాంతాల నుంచి త‌ర‌లి వ‌చ్చిన ఏసు భ‌క్తులంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలిపారు. దాదాపు 150 కోట్ల‌తో ఆసియా ఖండంలోనే అతి పెద్ద చ‌ర్చిని నిర్మించిన‌ పాల్‌ స‌న్ రాజ్ అత‌ని బృందానికి అభినంద‌న‌లు చెప్పారు. ఈ క‌రుణాపురం చ‌ర్చికి అనేక ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయన్నారు.

క్రీస్తు జ్యోతి చ‌ర్చి ఆసియాలోనే అతి పెద్ద చ‌ర్చి. అత్య‌ధికంగా ఖ‌ర్చు చేసిన ఈ నిధుల‌న్నీ మొత్తం ప్ర‌జ‌లు ఇచ్చిన విరాళాల‌తోనే క‌ట్ట‌డం విశేషంగా పేర్కొన్నారు. 40వేల ప్ర‌జ‌లు సీటింగ్ కెపాసిటీ ఉన్న చ‌ర్చి ఇదన్నారు. చ‌ర్చి గోపురం అమెరికా నుంచి తెప్పించారని, వియ‌త్నాం, ఫ్రాన్స్ నుంచి మ‌రికొన్ని టైల్స్ వంటివి తెప్పించారన్నారు. చ‌ర్చి లోప‌ల అభివృద్ధికి నా వంతుగా నేను కోటి రూపాయ‌లు ఇచ్చాననన్నారు.

ఇక్కడ ప్రతి ఏటా ఈ పూజలు ఘ‌నంగా జరుగుతున్నాయని, శాంతి, కరుణ, ప్రేమ, సేవ అన్న క్రీస్తు బోధనలు అందరికీ ఆచరణీయమని అందరినీ ప్రేమించాలి. శాంతి మార్గంలో నడవాలని కోరారు.

సేవాభావంతో మెలగాలి అన్న క్రీస్తు బోధనలు సర్వమానవాళికి ఆచరణీయమన్నారు. క్రీస్తు బాటలో నడిస్తే ఈ ప్రపంచంలో మోసాలు, పాపాలు ఉండవన్నారు. యుద్దాలకు ఆస్కారం ఉండదు. అన్ని మతాల సారం మానవత్వమే, అన్ని మతాలకు దేవుడు ఒక్కడే. ఇవే బోధ‌న‌ల ప్రేర‌ణ‌తో మ‌న సీఎం కెసిఆర్ ప‌రిపాల‌న చేస్తున్నారన్నారు. కేసిఆర్ అన్ని మతాలను సమానంగా చూస్తూ అధికారికంగా అన్ని పండుగలు నిర్వహిస్తున్నారు.

తెలంగాణలో క్రిస్టియన్ మైనారిటీల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. క్రిస్టియన్ మైనారిటీల ఆత్మగౌరవం పెంపొందించేలా వారికి 2 ఎకరాల స్థలంలో 10 కోట్ల రూపాయలతో క్రిస్టియన్ భవనం నిర్మిస్తున్నారు.

కార్య‌క్ర‌మంలో చ‌ర్చి ఫాద‌ర్ పాల్‌ స‌న్ రాజ్, గోపు జయప్రకాశ్, వివిధ ప్రాంతాల నుంచి త‌ర‌లి వ‌చ్చిన క్రీస్తు భ‌క్తులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Updated On 6 May 2023 12:52 PM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story