విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఖమ్మంలో బుధవారం జరిగే భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సభకు పార్టీ కేడర్‌తో పాటే మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు బస్సుల్లో బయల్దేరి వెళ్ళారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ నుంచి బీఆర్ఎస్ సభకు బయల్దేరిన బస్సులో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్, మానుకోట నుంచి మంతిర సత్యవతి, ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌లు తరలివెళ్ళారు. మరిపెడ నుంచి […]

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఖమ్మంలో బుధవారం జరిగే భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సభకు పార్టీ కేడర్‌తో పాటే మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు బస్సుల్లో బయల్దేరి వెళ్ళారు.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ నుంచి బీఆర్ఎస్ సభకు బయల్దేరిన బస్సులో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్, మానుకోట నుంచి మంతిర సత్యవతి, ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌లు తరలివెళ్ళారు. మరిపెడ నుంచి రాష్ట్ర రహదారుల అభివృద్ది సంస్థ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు తరలి వెళ్లారు. వీరంతా ఒక బస్సులో ప్రయాణం చేస్తున్నారు.

-ఖమ్మం నుంచి ఓరుగల్లు శ్రేణులు

దేశం కోసం, భారత బాగు కోసం అంటూ ఖమ్మంలో భారత రాష్ట్ర సమితి నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభకు ఉమ్మడి వరంగల్ జిల్లాల నుంచి పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు తరలివెళ్ళారు. మహబూబాబాద్ జిల్లా పరిధిలోని ఇల్లెందు, మానుకోట, డోర్నకల్, పాలకుర్తి నియోజకవర్గం ప్రారంభమైన వాహనాలను మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యేలు హరిప్రియ, రెడ్యానాయక్ జెండా ఊపి ప్రారంభించారు. మంత్రి సత్యవతి రాథోడ్ మానుకోట జిల్లా పార్టీ అధ్యక్షురాలు ఎంపీ మాలోత్ కవిత, శంకర్ నాయక్ ఈ జన సమీకరణలో భాగస్వామ్యం అయ్యారు. లంబాడా మహిళా కేడర్‌తో పాటు రాథోడ్ నృత్యం చేశారు.

ఈ నాలుగు నియోజకవర్గాలతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హనుమకొండ, వర్ధన్నపేట, వరంగల్, నర్సంపేట, జనగామ తదితర ప్రాంతాల నుంచి ముఖ్య నాయకులు తమ తమ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో బయలుదేరి వెళ్లారు. హనుమకొండ జిల్లా పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన వాహనాలకు చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ జెండా ఊపి ప్రారంభించారు.

Updated On 18 Jan 2023 8:27 AM GMT
krs

krs

Next Story