Warangal
- గతంలో డ్రైవర్‌గా పనిచేసిన రాజు మృతి
- పరామర్శించిన ఎర్రబెల్లి దయాకర్‌రావు దంపతులు
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: గతంలో తన వ్యక్తిగత డ్రైవర్ గా పనిచేసిన రాజు ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మరణించారు. వరంగల్ ఎంజీఎం మార్చురీలో ఉన్న మృతదేహానికి మంత్రి ఎర్రబెల్లి దంపతులు నివాళులర్పించారు. సంఘటన జరిగిన తీరును తెలుసుకుని విచారం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి దంపతులు కంటతడి పెట్టారు. రాజుతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. డ్రైవర్ గానే గాక తమ కుటుంబంలో సభ్యుడిగా అతను మెలిగేవాడిని ఆవేదన వ్యక్తం చేశారు. అతడి భార్య కుటుంబాన్ని ఓదార్చారు. తమ ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలిపారు. రాజు కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.