Warangal
- నీరా సేవిస్తే ఆరోగ్యానికి మంచిది
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: గిరక తాటి చెట్టు ఎక్కి… ఆ కల్లును సేవించారు. కల్లుకు అందులోను గిరిక తాటి కల్లుకు ఔషధ గుణాలు ఉన్నాయని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కల్లు సేవిస్తే ఆరోగ్యానికి మంచిదని చెప్పారు.
పాలకుర్తి మండలం మల్లంపల్లిలో గురువారం మూడు సంవత్సరాల క్రితం తాను పంపిణీ చేసిన గిరక తాడుకి కల్లు పారుతున్న విషయాన్ని తెలుసుకుని.. ఆ చెట్టు ఎక్కారు. అనంతరం స్థానికులకు ఆ కల్లు ఉపయోగాలు తెలిపారు. అందుకే వాటి పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని అన్నారు.
గిరకతాటి చెట్లను పాలకుర్తి నియోజకవర్గంలో పంపిణీ చేశానని తెలిపారు. ప్రస్తుతం అవి కల్లుని ఇస్తున్నాయని, ఈ కల్లుకి మంచి డిమాండ్ ఉందని మంత్రి వివరించారు.