గ్రీవెన్స్ స్పందన పై తీవ్ర అసంతృప్తి చిన్న చిన్న పనులు కూడా జాప్యం గైర్హాజరైతే కఠిన చర్యలు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: గ్రేటర్ వరంగల్ (Warangal) మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై కమిషనర్ షేక్ రిజ్వాన్ భాషా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రీవెన్స్ లో వచ్చిన ఫిర్యాదులపై స్పందించకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించకుండా జాప్యం చేయడం ఏమిటంటే నిలదీశారు. సోమవారం నిర్వహించిన వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ గ్రీవెన్స్ సెల్ […]

  • గ్రీవెన్స్ స్పందన పై తీవ్ర అసంతృప్తి
  • చిన్న చిన్న పనులు కూడా జాప్యం
  • గైర్హాజరైతే కఠిన చర్యలు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: గ్రేటర్ వరంగల్ (Warangal) మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై కమిషనర్ షేక్ రిజ్వాన్ భాషా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రీవెన్స్ లో వచ్చిన ఫిర్యాదులపై స్పందించకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించకుండా జాప్యం చేయడం ఏమిటంటే నిలదీశారు. సోమవారం నిర్వహించిన వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ గ్రీవెన్స్ సెల్ లో షేక్ రిజ్వన్‌ బాషా టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, సానిటరీ అధికారుల తీరుపై మండిపడ్డారు.

ఇటీవలనే రిజ్వాన్ భాషా నూతనంగా వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా బదిలీపై వచ్చారు. బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలంలోనే పాలన పై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఉదయం శానిటరీ, ఇంజనీరింగ్ విభాగాలను పరిశీలిస్తూ మధ్యాహ్నం పాలనాపరమైన వ్యవహారాలను చక్కబెడుతున్నారు. మరోవైపు ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ క్రమంలో కార్పొరేషన్ లో పని చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న అధికారులను గుర్తించి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పద్ధతి మార్చుకోకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. చిన్నపనులు సకాలంలో పూర్తి చేయకుంటే అధికారుల పై చర్యలు తీసుకుంటామని హెచ్చరిక చేశారు.

గ్రీవెన్స్ లో ప్రతి వారం 100 కు పైగా ఫిర్యాదులు పెరుగుతున్నాయి. అయినా వాటిని పరిష్కరించకుండా పెండింగ్లో పెడుతున్నారని విమర్శించారు. అసలు పని చేస్తున్నారా? లేదా అంటూ అధికారులకు చివాట్లు పెట్టారు. ఇకనుంచి ముందస్తు సమాచారం లేకుండా గ్రీవెన్స్ కు రాని అధికారులపై చర్యలు ఉంటాయని కమిషనర్ స్పష్టం చేశారు. అలసత్వం వీడి పనులు సత్వరం పూర్తిచేయాలని అధికారులకు కమిషనర్ రిజ్వాన్ భాషా ఆదేశించారు.

Updated On 6 Jun 2023 1:52 AM GMT
Somu

Somu

Next Story