HomelatestWarangal | చదివింది MSC కంప్యూటర్ సైన్స్.. చేసేది చోరీలు

Warangal | చదివింది MSC కంప్యూటర్ సైన్స్.. చేసేది చోరీలు

Warangal |

  • చెడు వ్యసనాలకు అలవాటు పడి తాళం వేసి వున్న ఇండ్లల్లో చోరీలు
  • వాహనాలు, బంగారం స్వాధీనం

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: చదివింది ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ అయినప్పటికీ చెడు వ్యసనాలకు అలవాటు పడి చోరీలు పాల్పడుతున్న దొంగను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుండి సుమారు 11లక్షల 50వేల రూపాయల విలువైన 192 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు మోటారు సైకిళ్ళు, ఒక సెల్ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్రైమ్స్ డిసిపి మురళీధర్ వివరాలను వెల్లడిస్తూ. పోలీసులు అరెస్టు చేసిన ఎర్రబోతుల సునీల్, తండ్రి పేరు బాబు, వయస్సు 24, మహబూబాద్ జిల్లా, గంగారం మండలం, పెద్దఎల్లాపూర్ ( ప్రస్తుతం జులై వాడ, హనుమకొండలో నివాసం వుంటున్నాడు).

నిందితుడు సునీల్ కాకతీయ విశ్వవిద్యాలయములో కంప్యూటర్ సైన్సు ఎమ్మెస్సీ పూర్తి చేసి ఆన్లైన్లో క్రికెట్తో పాటు ఇతర క్రీడలపై బెట్టింగ్కు పాల్పడుతూ చేడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు. దీనితో పెద్ద మొత్తం డబ్బులు పోగోట్టుకోవడంతో తిరిగి డబ్బును సులభంగా డబ్బును సంపాదించాలనుకున్నాడు.

దొంగతనాలు ప్రారంభం

నిందితుడు సునీల్ మరో నిందితుడితో కల్సి 2020 సంవత్సరంలో కేయుసి, హనుమకొండ, మట్వాడ, ధర్మసాగర్, ఆలేర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పదిహేనుకు పైగా చోరీలకు పాల్పడ్డాడు. 2022 సంవత్సరంలో నిందితుడుని సుబేదారి పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించడంతో పాటు నిందితుడిపై సుబేదారి పోలీసులు పీడీ యాక్ట్ ఉత్తర్వులు అమలు చేశారు.

గత సంవత్సరం అక్టోబర్లో జైలు నుండి విడుదలయిన నిందితుడు పలు ఇండ్ల తాళాలు పగులగోట్టి విలువైన బంగారు అభరణాలను చోరీ చేసాడు. పోలీసులు
నిందితుడిని సకాలంలో పట్టుకోని చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన వారిని పోలీస్ కమిషనర్ అభినందించారు.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular