Warangal విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: అట్టడుగు వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని, ఆ దిశలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. ప్రతి ఏటా నిర్వహించిన మాదిరిగానే ఏడాది కూడా కార్మిక దినోత్సవం సందర్భంగా మే నెల 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు నిర్వహిస్తున్న కార్మిక ఉద్యోగ సంక్షేమ మాసోత్సవ కార్యక్రమములో భాగంగా సోమవారం హనుమకొండ […]

Warangal

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: అట్టడుగు వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని, ఆ దిశలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.

ప్రతి ఏటా నిర్వహించిన మాదిరిగానే ఏడాది కూడా కార్మిక దినోత్సవం సందర్భంగా మే నెల 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు నిర్వహిస్తున్న కార్మిక ఉద్యోగ సంక్షేమ మాసోత్సవ కార్యక్రమములో భాగంగా సోమవారం హనుమకొండ దీన్ దయళ్ నగర్, జ్యోతి రావు పులే కాలనీలలో నివసిస్తున్న అసంఘటిత రంగాలలో పని చేస్తున్న కార్మికుల ఇండ్లను వినయ్ భాస్కర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

అక్కడ నివసిస్తున్న కుటుంబాల పరిస్థితులు, ఆర్థిక, ఆరోగ్య స్థితుల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ నిరుపేదలకు గూడు నీడ కల్పించాలనే లక్ష్యంగా జీవో నెం 58ను తన నియోజకవర్గ పరిధిలో అమలు చేయడం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు వివరించారు. గుడిసెవాసుల నలబై ఏళ్ళ నిరీక్షణను తీర్చినట్లు వివరించారు.

ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశం పట్ల అవగాహన లేక చాలా మంది గుడిసెవాసులు దరఖాస్తు చేసుకోవడం లేదన్నారు. క్షేత్ర స్థాయిలో నిరుపేదలకు అవగాహన కల్పించేందుకే గుడిసెవాసుల ప్రాంతాల్లో పర్యటిస్తున్నట్లు చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం పాటు పడుతుంది అని తెలిపారు. ప్రభుత్వ స్థలంలో ఇల్లు నిర్మించుకున్న వారికి జీవో నంబర్ 58 ద్వారా ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తునట్టు అదే విధంగా కాలనీ లలో మౌళిక సదుపాయాల ఏర్పాటు చేస్తునట్టు వివరించారు.

అనేక మంది ప్రభుత్వ స్థలాలలో ఇల్లు నిర్మించుకున్న వారు ఈ నెల 31వ తేదీ లోపు జీవో నంబర్ 58 ద్వారా ధరఖాస్తు చేసుకొని ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో వాసు చందర్, ఎమ్మార్వో రాజకుమార్, స్థానిక కార్పొరేటర్ మామిండ్ల రాజు, డివిజన్ అధ్యక్షులు వెంకన్న మరియు తదితరులు పాల్గొన్నారు.

Updated On 8 May 2023 5:00 PM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story