డి-37 వద్ద ప్రారంభించిన ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి విధాత : యాసంగి పంటల సాగుకు ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు(ఏఎమ్మార్పీ) డి-37 సాగునీటి కాల్వకు గుండ్లపల్లి వద్ద న‌ల్ల‌గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులు చాలా సంతోషంగా ఉన్నారన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల్లో పూడిక తీయించి, 24 గంటలు ఉచిత […]

  • డి-37 వద్ద ప్రారంభించిన ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి

విధాత : యాసంగి పంటల సాగుకు ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు(ఏఎమ్మార్పీ) డి-37 సాగునీటి కాల్వకు గుండ్లపల్లి వద్ద న‌ల్ల‌గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులు చాలా సంతోషంగా ఉన్నారన్నారు.

మిషన్ కాకతీయ ద్వారా చెరువుల్లో పూడిక తీయించి, 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తూ రైతుబంధు, రైతుబీమా అమలు చేస్తూ సీఎం కేసీఆర్ రైతుబంధువుగా నిలిచార‌న్నారు. ఇదే విధానాన్ని దేశవ్యాప్తంగా రైతులు కోరుకుంటున్నారని, అందుకే బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసి, కేంద్రంలో రైతు ప్రభుత్వం కోసం కృషి చేస్తున్నారని, ఇందుకు రైతులంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

120 రోజులపాటు వార‌బందీ పద్ధతిలో అందించే సాగునీటిని పొదుపుగా వాడుకోవాలని రైతులను కోరారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఇంజినీరింగ్ అధికారులతోపాటు ఎంపీపీ కరీంపాషా, జ‌డ్పీటీసీ వంగూరు లక్ష్మయ్య, సింగిల్ విండో చైర్మన్ ఆలకుంట నాగరత్నం రాజు, బీఆర్ ఎస్ మండ‌లాధ్యక్షుడు దేప వెంకట్‌రెడ్డి, నాయ‌కులు బకరం వెంకన్న, అయితగోని యాదయ్య, బడుపుల శంకర్, ఎంపీటీసీ ఇరిగి సహదేవ్, స్థానిక సర్పంచ్ పంతంగి సరితాశ్రీనాథ్, సింగిల్ విండో వైస్ చైర్మన్ తవిటి కృష్ణ, మహిళా అధ్యక్షురాలు కొప్పోలు విమలమ్మ, ఎన్న నర్సిరెడ్డి, వలికి చంద్రయ్య, వంగూరు వెంకటగిరితోపాటు పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.

Updated On 4 Jan 2023 3:59 PM GMT
krs

krs

Next Story