• రూ.3.5 కోట్ల విలువైన ప్రత్యేక పరికరాలు దివ్యాంగులకు అందజేత విధాత‌: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ గురువారం వేములవాడలో దివ్యాంగుల, వయోవృద్ధుల‌ సౌకర్యార్థం ప్రత్యేక పరికరాలను అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ADIP (Assistance to Disabled Persons), రాష్ట్రీయ వయోశ్రీ యోజన (RVY) పథకాల కింద 3.5 కోట్ల రూపాయలతో దివ్యాంగులకు, వయోవృద్ధుల‌కు వీల్ ఛైర్లు, వినికిడి యంత్రాలు సహా వివిధ ఉప కరణాలను స్వయంగా అందించారు. రెండు వేల […]

• రూ.3.5 కోట్ల విలువైన ప్రత్యేక పరికరాలు దివ్యాంగులకు అందజేత

విధాత‌: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ గురువారం వేములవాడలో దివ్యాంగుల, వయోవృద్ధుల‌ సౌకర్యార్థం ప్రత్యేక పరికరాలను అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ADIP (Assistance to Disabled Persons), రాష్ట్రీయ వయోశ్రీ యోజన (RVY) పథకాల కింద 3.5 కోట్ల రూపాయలతో దివ్యాంగులకు, వయోవృద్ధుల‌కు వీల్ ఛైర్లు, వినికిడి యంత్రాలు సహా వివిధ ఉప కరణాలను స్వయంగా అందించారు. రెండు వేల మంది ఉప‌క‌ర‌ణాలు అంద‌జేసిన‌ట్టు తెలిపారు.

ఈ సందర్భంగా వేములవాడలోని ఎస్ఆర్ ఆర్ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో పాల్గొని పరికరాలకు అందజేశారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ దివ్యాంగులు, వ‌యోవృద్ధుల కోసం మేదీ చేప‌డుతున్న‌ప‌థ‌కాల గురించి వివ‌రించారు. ప‌థ‌కాల‌ను అర్హులంద‌రూ త‌ప్ప‌కుండా స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు. అలాగే రాష్ట్ర ప్ర‌భుత్వం స్థ‌లం కేటాయిస్తే దివ్యాంగుల కోసం అన్ని వ‌స‌తుల‌తో సంక్షేమ భ‌వ‌నాన్ని నిర్మిస్తాన‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న హామీనిచ్చారు.

Updated On 24 Nov 2022 11:18 AM GMT
krs

krs

Next Story