Leopard విధాత: ఈ ఫొటోలో ఒక చిరుతపులి అక్కడి మట్టిలో సరిగ్గా ఒదిగిపోయింది. దానిని కనిపెట్టగలరా? ఈ ఫొటోను వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ హేమంత్‌ దబి తీశారు. చిరుత ఎక్కడ ఉన్నదో కనిపెట్టాలంటూ చాలెంజ్‌ విసిరారు. టైమ్‌పాస్‌ చేసేవారు సరదాగా ఈ ఫొటో కళ్లుపెట్టి వెతికేస్తున్నారు. వామ్మో ఇదే ఫొటో అంటూ నిశ్చేష్టులవుతున్నారు. ఫాసినేటింగ్‌ అనే ట్విట్టర్‌ అక్కౌంట్‌లో పోస్టు చేసిన ఈ ఫొటో వైరల్‌గా మారింది. There's a leopard in this photo by Hemant […]

Leopard

విధాత: ఈ ఫొటోలో ఒక చిరుతపులి అక్కడి మట్టిలో సరిగ్గా ఒదిగిపోయింది. దానిని కనిపెట్టగలరా? ఈ ఫొటోను వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ హేమంత్‌ దబి తీశారు. చిరుత ఎక్కడ ఉన్నదో కనిపెట్టాలంటూ చాలెంజ్‌ విసిరారు. టైమ్‌పాస్‌ చేసేవారు సరదాగా ఈ ఫొటో కళ్లుపెట్టి వెతికేస్తున్నారు. వామ్మో ఇదే ఫొటో అంటూ నిశ్చేష్టులవుతున్నారు. ఫాసినేటింగ్‌ అనే ట్విట్టర్‌ అక్కౌంట్‌లో పోస్టు చేసిన ఈ ఫొటో వైరల్‌గా మారింది.

దీనిని వెతికే క్రమంలో చాలా మంది ఓపికి నశించి వదిలేశారు. కొంతమంది పట్టువదలని విక్రమార్కులు మొత్తానికి దాని జాడ కనిపెట్టేశారు. ‘దీన్ని కనిపెట్టడానికి ఏళ్లు పట్టింది’ అంటూ ఒక యూజర్‌ రాశారు. ‘నా జీవితంలో 5 నిమిషాలు ఆవిరయ్యాయి’ అని మరొకరు పేర్కొన్నారు.

తూచ్‌.. అసలు ఆ ఫొటోలో చిరుత పులే లేదు.. నేను కళ్ల జోడు పెట్టుకుని మరీ చూశానంటూ ఒకరు చేతులెత్తేశారు. మీకు కనిపించిందా? లేదంటే కింద ఫొటోలో రౌండ్‌ చేసి ఉంది చూడండి! ఆగండి.. మీకు చేతకాలేదు అనిపిస్తేనే కింది ఫోటో చూడండి!

Updated On 1 May 2023 2:20 AM GMT
krs

krs

Next Story