విధాత: లోక్‌సభ నియోజకవర్గాల (డీలిమిటేషన్)పై నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్‌హాసన్ (Kamal Haasan) స్పందించారు. డీలిమిటేషన్ ప్రక్రియను జనాభా ప్రాతిపదికన చేస్తామనడంపై ఆయన సందేహాలు వ్యక్తం చేశారు. మంచి పని చేసినందుకు దక్షిణ భారతానికి శిక్ష పడ కూడదని ఆయన వ్యాఖ్యానించారు. ఓ మీడియా సంస్థ ఏర్పాటు చేసిన సదస్సులో కమల్ పాల్గొన్నారు. 'నేను దక్షిణం కాదు ఉత్తరం కాదు. మధ్యే వాదిని. నా మొదటి ప్రాధాన్యం ఎప్పుడూ భారత్‌కే. అయితే భారత్‌కు […]

విధాత: లోక్‌సభ నియోజకవర్గాల (డీలిమిటేషన్)పై నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్‌హాసన్ (Kamal Haasan) స్పందించారు. డీలిమిటేషన్ ప్రక్రియను జనాభా ప్రాతిపదికన చేస్తామనడంపై ఆయన సందేహాలు వ్యక్తం చేశారు. మంచి పని చేసినందుకు దక్షిణ భారతానికి శిక్ష పడ కూడదని ఆయన వ్యాఖ్యానించారు. ఓ మీడియా సంస్థ ఏర్పాటు చేసిన సదస్సులో కమల్ పాల్గొన్నారు.
'నేను దక్షిణం కాదు ఉత్తరం కాదు. మధ్యే వాదిని. నా మొదటి ప్రాధాన్యం ఎప్పుడూ భారత్‌కే. అయితే భారత్‌కు చెందిన దక్షిణ ప్రాంతం గురించి ఎక్కువ మాట్లాడతా. ఈ ప్రాంతం వారంతా ఒక వేదికపై వచ్చి తమ సమస్యలపై గళమెత్తాలి. దేశం ఎలా ముందుకెళ్లాలో నిర్దేశించాలి' అని కమల్ అన్నారు.
'ప్రస్తుతం డీలిమిటేషన్ ప్రక్రయపైనే నా ఆందోళన అంతా. అది ఒకవేళ జనాభా ఆధారంగానే జరిగితే.. దక్షిణ భారతం గొంతెత్తాల్సిన అవసరముంది అని వ్యాఖ్యానించారు. ఒక్క ఉత్తర్‌ప్రదేశ్, బిహార్ రాష్ట్రాలను కలిపితే మొత్తం దక్షిణ భారత రాష్ట్రాలను పక్కన పెట్టేయొచ్చని ఆయన పేర్కొన్నారు.
భవిష్యత్తులో జరగబోయే డీ లిమిటేషన్ ప్రక్రియ వల్ల ఉత్తర్ భారత్‌లో ఎంపీ సీట్లు పెరిగి, దక్షిణ భారతంలో తగ్గిపోతాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో కమల్ హాసన్ పైవిధంగా వ్యాఖ్యానించారు.
