Saturday, December 3, 2022
More
  Homelatestవిద్వేషాలు లేని వికాసం కావాలి

  విద్వేషాలు లేని వికాసం కావాలి

  తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో జరిగిన సామాజిక సదస్సులో వక్తలు

  విధాత: తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో జరిగిన సదస్సులో దేశపతి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సదస్సులో ‘సంక్షోభంలో భారత ఆర్ధిక వ్యవస్థ – కారణాలు – ప్రభావాలు’ అనే అంశంపై, ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ గారు ‘భారత రాజ్యంగ విలువలు – ఎదుర్కొంటున్న సవాళ్లు’ అనే అంశంపై ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ప్రసంగించారు.

  దేశపతి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అయన మాట్లాడుతూ ద్రవ్యోల్బణంతో పాటూ ఎగుమతి దిగుమతుల మధ్య పెరిగిపోతున్న అంతరం, రూపాయి విలువ దారుణంగా పడిపోవటం వంటి కారణాల వల్ల విదేశీ మారక ద్రవ్య నిలువలు తరిగిపోయినాయి. దేశంలో ఉద్యోగ కల్పన శాతం గనక చూస్తే అది గత నలభై ఐదు సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా దిగజారిపోయింది.

  కరోనా విపత్తు సమయంలో ఉత్పన్నమైన పరిస్థితులను నియంత్రించడంలో విఫలమైన బీజేపీ ప్రభుత్వం ఆ ఆపత్సమయంలో సైతం మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నించి తన వికృత మానసిక ధోరణిని ప్రదర్శించింది. తగిన ప్రణాళిక లేకుండా అనాలోచితంగా, ఆకస్మికంగా విధించిన లాక్ డౌన్ దేశ ప్రజలను అష్టకష్టాలకు గురిచేసింది. లక్షలాదిమంది వలస కార్మికులు వివిధ నగరాల నుంచి తమ సొంత ఊళ్లకు చేరుకోవడానికి వందల మైళ్ళ దూరం కాలినడకన చేసిన పయనం దేశ చరిత్రలో ఎన్నడూ ఎరుగని అత్యంత విషాదకర సంఘటన.

  రైలు పట్టాలపై కార్మికుల దేహాలు ఛిద్రమై చెల్లా చెదురైన సన్నివేశం హృదయ విదారక సన్నివేశం జనం స్మృతిపథం లో మానని గాయమై సలుపుతూనే ఉంది. కరోనా అనంతర కాలంలో కేంద్రం తీసుకున్న ఆర్ధిక ఉద్దీపన చర్యల్లోనూ నిజాయితీ లోపించటంతో ప్రజలకు ఏ రకమైన ఉపశమనం లభించలేదు. ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ 23 కోట్ల మంది ప్రజలు ఇప్పటికి పేదరికంలో ఉన్నారు దేశంలో ఉన్న సంపదలో 20% ఒక శాతం జనాభా చేతిలో ఉంది రిటన్ దేశాన్ని అధిగమించి ఐదవ పెద్ద అధిక శక్తి ఎదిగినప్పటికీ భారతదేశం యొక్క తలసరి ఆదాయం బ్రిటన్ ప్రజల తలసరి ఆదాయం కంటే 20 రెట్లు తక్కువగా ఉంది.

  డిమానిటైజేషన్ అనంతరం స్వతంత్ర భారత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరుసగా నాలుగు సంవత్సరాల పాటు జాతీయ ఆర్థిక అభివృద్ధి సూచిక దారుణంగా పడిపోయింది ఇది ఎంత కరోనాకి ముందు. డిమాండ్లైజేషన్ వల్ల జరిగిన పరిణామం ఇదైతే, వాళ్ళు చేసిన ప్రచారం మరొకటి నల్లదాన్ని బయటకి లాగుదామని దొంగ నోట్లు రద్దు చేయిస్తామని పెద్ద నోట్ల వల్ల నిల్వచేపడ్డ ధనాన్ని వెనక్కి తీసుకొస్తామని ఆ డబ్బులు పంచుతామని తప్పుడు ప్రచారం చేసినారు.

  అదేవిధంగా కార్పొరేట్ కంపెనీలకు ఆదాయ పనులను ఒకేసారి పది శాతం తగ్గించింది. భారత ఆర్థిక వ్యవస్థకు వచ్చిన లక్ష 80 వేల కోట్ల నష్టం వాటిల్లింది. ఈ నష్టాన్నిపెట్రోల్ పై అధిక ధరలు, పన్నులు పెంచడం ద్వారా ప్రజల నుండి వసూలు చేసింది. భారత ఆర్థిక వ్యవస్థ గతంలో ఎన్నడూ లేని విధంగా పాతాళానికి పడిపోయిందని నీతి అయోగ్ నివేదికలే చెప్తున్నాయి. ప్రపంచ ఆహార సూచికలో 107వ స్థానానికి పడిపోవడానికి దేశంలో ఉన్న పేదరికానికి నిదర్శనం.

  ప్రొఫెసర్ గంటా చక్రపాణి భారత రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు అనే అంశంపై మాట్లాడుతూ భారత రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం మన దేశాన్ని సర్వ సత్తాక, లౌకిక, సౌమ్యవాద, గణతంత్ర దేశంగా ప్రజలందరూ ఆమోదించినట్టుగా రాజ్యాంగ రచయితలు పొందుపరిచారు. ప్రవేశిక అనేది రాజ్యాంగం మొత్తానికి ఒక తాత్పర్యం లాంటిది. ప్రజలందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం రాజ్యాంగం ఇచ్చిన హక్కు. గత ఎనిమిది సంవత్సరాలుగా దేశంలో లౌకికవాదం, సామ్యవాదం, సమానత్వం అనే పదాలను మాట్లాడితే తప్పుగా చిత్రీకరణ చేస్తున్నారు.

  స్వేచ్ఛ సమానత్వలను అందరికీ అందివ్వడం అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఈ స్వేచ్ఛగా భావ ప్రకటన, మతాచారాలు పాటించడం. ఈ పదాలను, వివిధ మతాచార వ్యవహారాలను కూడా నిషేధించిన పరిపాలన సాగుతున్నది. విభిన్న సంస్కృతుల సమ్మేళనం దేశంలో భావ ప్రకటన స్వేచ్చలేదు స్వేచ్ఛగా ఆలోచించే అవకాశం లేదు స్వేచ్ఛగా మతాచారాలను పాటించే అవకాశం లేకుండా పోయింది.

  అవకాశాలలో సమానత్వాన్ని కల్పించడం, వివక్ష గురైన వారిని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాలి. రాజ్యాంగం ఏ విలువల ప్రాతిపదికల నడువాలో ఆ అంశాలన్నీ కూడా రాజ్యాంగ ప్రవేశికలోనే రచయితలు పొందు పరిచారు. ప్రజాస్వామ్యంలో అధికారంలో ఎవరున్నా కూడా రాజ్యాంగ తత్వం ప్రాతిపదికన సాగాలి కానీ వ్యక్తలు ఇస్తా ఇష్టాలు వ్యక్తిగత సిద్ధాంతాల ప్రాతిపదికన పరిపాలన సాగడానికి వీల్లేదు.

  రాజ్యాంగం ప్రకారం కాకుండా వ్యక్తులను శాసించే సంస్థల ప్రాతిపదికన భారత దేశంలో పరిపాలన సాగిస్తున్నారు. జాతీయత అంటే హిందూ మతీకరణ కాదు భారత జాతీయత. భారత ప్రజలందరికీ సంక్షేమాన్ని అభ్యర్థి అభ్యున్నతిని కోరుకునే జాతీయత. రాజ్యాంగ విలువలను అతిక్రమించి ప్రజల మధ్య విభజన రేఖ గీస్తూ భయానకమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్, సమన్వయ కర్త ఓంటెద్దు నర్సింహారెడ్డి, జి. వెంకటేశ్వర్లు, హెచ్. రవీందర్, విజయానంద్,బిక్షపతి నాయక్, వెంకన్న, రూబి తదితరులు పాల్గొన్నారు.

  ఈ సదస్సులో ప్రొఫెసర్లు కె. నాగేశ్వర్, ఘంటా చక్రపాణి సభాద్యక్షత తెలంగాణ వికాస సమితి రాష్ట్ర అధ్యక్షుడు దేశపతి శ్రీనివాస్ టీఎన్జివో మాజీ నేత దేవిప్రసాద్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి చంద్ తెలంగాణ వికాస సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్ సమన్వయ కర్త ఓ. నర్సింహారెడ్డి సలహాదారులు వేణు గోపాల స్వామి ఉపాధ్యక్షులు మల్లవఝుల విజయానంద్ జి వెంకటేశ్వర్లు పిండిగ వెంకన్న బిక్షపతి నాయక్ హెచ్ రవీందర్ పాల్గొన్నారు.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular

  You cannot copy content of this page