విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: గౌరవెల్లి రిజర్వాయర్ భూ నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకుంటామని టీపీసీసీ ఛీఫ్ రేవంత్‌రెడ్డి హామినిచ్చారు. అక్కన్నపేట మండలం కట్కూరులో క్యాంప్ వద్ద భూ నిర్వాసిత మహిళలతో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా మహిళలు స్థానిక ఎమ్మెల్యే పట్టించు కోవడంలేదని.. ఒంటొద్దు పోకడతో సమాధానమిస్తున్నాడన్నారు.
ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ద్వారా మాకు తీరని అన్యాయం జరిగిందని మొదటగా 20 లక్షల ప్యాకేజీ ఇస్తామని చెప్పి దానిని 12 లక్షల కుదించి నేడు అవి కూడా వచ్చేవి నమ్మకం లేవన్నారు. మేజర్ అయిన యువతీ యువకులకు 2017 వరకే పరిగణంలోకి తీసుకుంటారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గౌరవెల్లి రిజర్వాయర్ వల్ల మాకు తీరని అన్యాయం జరిగిందని రేవంత్ రెడ్డి ముందు వాపోయారు.
ప్రాజెక్టులో 120 మంది బాధితులకు ఇప్పటివరకు నష్టపరిహారం అందకపోవడం సిగ్గుచేటని భూ నిర్వాసితులు కమిషన్లు ఇచ్చేటట్టు లేరని ఎమ్మెల్యే వారి పరిహారానికి అడ్డుపడుతున్నారన్నారు. పది నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని నిర్వాసితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.