KCR లబానా లంబాడీ రాష్ట్ర అధ్యక్షుడు తాన్ సింగ్ నాయక్ విధాత ప్రతినిధి, నిజామాబాద్: లబానా లంబాడీల సమస్యలు పరిష్కరించకపోతే సీఎం కేసీఆర్ పోటీ చేసే కామారెడ్డి నియోజకవర్గంలో కులస్థుల తరపున 1016 నామినేషన్లు వేస్తామని లబానా లంబాడీ రాష్ట్ర అధ్యక్షుడు తాన్ సింగ్ నాయక్ హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఇకపై బుజ్జగింపులు ఉండవని, నేరుగా యుద్ధానికే సిద్ధమవుతామన్నారు. ఇప్పటిదాకా ప్రభుత్వాన్ని వేడుకున్నామని, ఇకపై […]

KCR

లబానా లంబాడీ రాష్ట్ర అధ్యక్షుడు తాన్ సింగ్ నాయక్

విధాత ప్రతినిధి, నిజామాబాద్: లబానా లంబాడీల సమస్యలు పరిష్కరించకపోతే సీఎం కేసీఆర్ పోటీ చేసే కామారెడ్డి నియోజకవర్గంలో కులస్థుల తరపున 1016 నామినేషన్లు వేస్తామని లబానా లంబాడీ రాష్ట్ర అధ్యక్షుడు తాన్ సింగ్ నాయక్ హెచ్చరించారు.

కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఇకపై బుజ్జగింపులు ఉండవని, నేరుగా యుద్ధానికే సిద్ధమవుతామన్నారు. ఇప్పటిదాకా ప్రభుత్వాన్ని వేడుకున్నామని, ఇకపై తాడోపేడో తేల్చుకుంటామన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం వేసిన చెల్లప్ప కమిషన్ కు విలువ ఉందా…? ఉంటే కమిషన్ నివేదిక ప్రకారం తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. ఉద్యమ నాయకునిగా కేసీఆర్ కు తమ సమస్యలు తెలియవా అని ప్రశ్నించారు. తామేమీ కొత్తగా అడగడం లేదని, బిచ్చంగా అడుక్కోవడం లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు.

వారం రోజుల్లో ప్రభుత్వం స్పందించకపోతే 25 వేల మందితో కామారెడ్డిలో ఏక్తా ర్యాలీ చేపడతామని, కలెక్టరేట్ ను దిగ్బంధిస్తామని, అప్పటికీ స్పందన లేకపోతే సెక్రెటేరియేట్ ను ముట్టడిస్తామని హెచ్చరిక జారీ చేశారు. ప్రాణాలకైనా తెగిస్తామని, హక్కులను సాధించుకుంటామన్నారు.

Updated On 5 Sep 2023 1:11 PM GMT
somu

somu

Next Story