- వరంగల్ ప్రజా ప్రతినిధుల వినతి
విధాత, వరంగల్: రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్ హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ సారథ్యంలో రేషన్ డీలర్ల సంఘం నాయకులు మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్ ను మంగళవారం హైదరాబాద్లో కలిసి సమస్యలపై వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా మంత్రులు సమస్యలపై సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. గోదాం నుండి ఎలాంటి కోతలు లేకుండా బియ్యం సరఫరా, వారికి అమలు చేసిన కమిషన్ తో పాటు పూర్తి బకాయిల చెల్లింపు విషయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రులు చెప్పారని వివరించారు.
వినతి పత్రం అందజేసిన వారిలో ఎమ్మెల్సీ రవీందర్ రావు, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్, రేషన్ డీలర్ల సంఘం నాయకులు నాగరాజు , సత్యనారాయణ, రాజయ్య ఉన్నారు.