Thursday, March 23, 2023
More
    Homelatest26.02.2023 నుంచి 04.03.2023 వ‌ర‌కు వార ఫ‌లాలు.. ఆ రాశుల వారికి నూతన వస్తు ప్రాప్తి,...

    26.02.2023 నుంచి 04.03.2023 వ‌ర‌కు వార ఫ‌లాలు.. ఆ రాశుల వారికి నూతన వస్తు ప్రాప్తి, శుభవార్తలు

    మేష రాశి: శుభకార్యములను ఆచరింతురు. పట్టుదలతో వ్యవహరిస్తారు. కోర్టు వ్యవహారాలలో అనుకూలతలు కనిపిస్తున్నాయి. క్రీడాకారులు ఆటంకాలు కలిగిననూ విజయం సాధిస్తారు. రాజకీయ నాయకులు రాజనీతిజ్ఞతను ప్రదర్శిస్తారు. పెద్దల అండదండలు లభిస్తాయి. ధనప్రాప్తి కలుగుతుంది, దత్తాత్రేయ స్వామి ఆరాధన శుభములను కలుగచేస్తుంది.

    వృషభ రాశి: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అపవాదులు తొలగిపోతాయి. వివాహప్రయత్నాలు ఫలిస్తాయి. కార్యనిర్వహణ సామర్ధ్యమును ప్రదర్శిస్తారు. పండితులు, కవులు నూతన గ్రంధ‌ రచనలకు శ్రీకారం చుడ‌తారు. బంధు మిత్రుల ఆదరణ లభిస్తుంది. విద్యా సౌఖ్యం తక్కువ. ఆంజనేయస్వామి ఆరాధన శుభమును కలిగిస్తుంది.

    మిథున రాశి: పెద్దలతో విరోధములు ఏర్పడకుండా చూసుకోండి. అప‌కీర్తి కలుగుతుంది. బహుముఖ ధనవ్యయము కలుగుతుంది. ఇతరుల వ్యవహారాలలో తలదూర్చడం శ్రేయస్కరం కాదు. స్థిరాస్థి మూలక అశాంతి కలుగవచ్చును. సన్నిహిత వ్యక్తులు దూరమయ్యే ప్రమాదం కలుగవచ్చును. కళాకారులు వివాదాలలో చిక్కుకుందూరు. శివారాధన శ్రేయస్సు నిస్తుంది.

    కర్కాటక రాశి: తల్లిదండ్రుల అనారోగ్యం అశాంతిని కలిగిస్తుంది. ఆకస్మిక ధన వ్య‌యము కలుగవచ్చును. భూ, గృహలాభాములున్నను కొంత ఆలస్యము కావచ్చును. నూతన వస్తు ప్రాప్తి క‌లుగుతుంది. నూతన వ్యాపార ఆరంభ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొన్ని ఆటంకములు కలిగినను వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన బాధ్యతల నిర్వహిస్తారు. నృసింహ స్వామి ఆరాధ‌న మేలు చేస్తుంది.

    సింహ రాశి: కోపం వలన కార్యవిఘ్నాలు కలుగుతాయి. ప్రయాణ మూలక ఆసౌక‌ర్య‌ములు కలుగుతాయి. దుర్వార్తా శ్ర‌వ‌ణ‌ము కలుగవచ్చును. శ‌త్న‌త్య‌ము పెరుగుతుంది. శ‌రీరంలో వేడి ఎక్కువ కావడం వలన బలహీనతలు క‌లుగవచ్చును. సహచరులపై ద్వేషము పెంచుకోకండి. తొందరపాటు పనికిరాదు. విష్ణు ఆరాధన శుభ‌ములను క‌లిగిస్తుంది.

    కన్యా రాశి: చిక్కులన్ని క్రమముగా తొలగిపోతాయి. విద్యార్థులు స‌ద్గోష్టిలో పాల్గొనడం వలన ఉల్లాసంగా వుంటారు. శుభకార్యములక ప్రయాణాలు వుంటాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహమందు శుభాకార్య‌లు జ‌రుపు విషయమై ఆలోచనలు సాగుతాయి. రాద‌నుకున్న ధనము చేతికందుతుంది. నూతన వస్తు ప్రాప్తి కలుగుతుంది. లలితాదేవి ఆరాధన మరింత శుభములనిస్తుంది.

    తులా రాశి: ఔషధ సేవనము చేయవలసి రావచ్చును. అకారణ కలహములు బాధిస్తాయి. పని ఒత్తిడి ఎక్కువగా వుంటుంది. అనుకొని ఇబ్బందుల వలన మనఃక్లేశానికి గురౌతారు. కుటుంబ సభ్యులపై అపవాదులు బాధకలిగిస్తాయి. ఋణ‌మూలక అశాంతి కలుగుతుంది. శత్రుబాధలుంటాయి. శివారాధన కొంత ఉపశమనాన్ని కలిగిస్తుంది.

    వృశ్చిక రాశి: సాహసముతో పనులు పూర్త‌వుతాయి. పెద్దల ఆదరణ ఇబ్బందులను దూరం చేస్తుంది. తల్లిదండ్రులు ఆశీస్సులుంటాయి. నూతన పరిచయాలు కలుగుతాయి. ప్రయాణములలో ఆటంకాలు ఎక్కువౌతాయి. ఒక‌చో వాహన ప్రమాద‌ములు కలుగవచ్చును. తొందరపాటు పనికి రాదు. సుబ్రహ్మణ్య ఆరాధన మనోస్థైర్యాన్నిస్తుంది.

    ధనుస్సు రాశి: ప్రముఖలతో పరిచయం సంతోషాన్నిస్తుంది. దూరప్రాంతాల నుండి శుభ సమాచారం లభిస్తుంది. బంధుమిత్రుల ఆదరణ ల‌భిస్తుంది. పరోపకారముతో గౌరవాన్ని పొందుతారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో పరపతిని పొందుతారు. శరీరము ఉల్లాసంగా వుంటుంది. దుర్గా ఆరాధన మరిన్ని శుభాలనిస్తుంది.

    మకర రాశి: మోసగాళ్ళ బారిన పడకుండా జాగ్రత్త వహించండి. అతి కోపము అనర్థాలకు దారి తీస్తుందని గుర్తుంచుకోండి. వృత్తి యందు చిక్కులు కలుగుతాయి. బంధుమిత్ర వియోగములు కలుగవచ్చును. అకారణ కలహములు బాధిస్తాయి. ఆకస్మిక ప్రమాదాలు కలుగవచ్చును. మోకాళ్ళనొప్పులు, కడుపునొప్పి వుండవచ్చును. లక్ష్మీనారాయణుల ఆరాధ‌న మ‌న‌శ్శాంతినిస్తుంది.

    కుంభ రాశి: శత్రువులు పెరుగుతారు. సోదరులతో అభిప్రాయ భేదాలు రావచ్చును. శరీర బలహీనత‌లుంటాయి. ఎముకలు, నరాలకు సంబంధించిన ఇబ్బందులు కలుగవచ్చును. ప్రయత్న కార్యాలలో ప్రతికూల ఫలితాలు వుండవచ్చును. మిత్ర ద్రోహములు మనశ్శాంతిని పొగొడతాయి. అకారణ కలహాములుండ‌వచ్చాను. గ‌ణ‌ప‌తి ఆరాధ‌న చిక్కుల‌ను దూరం చేస్తుంది.

    మీన రాశి: వివాహ ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. నూతన వస్తు ప్రాప్తి కలుగుతుంది. నూతన బాధ్యతలు నిర్వహించవలసి వుంటుంది. ప్రయత్నకార్యాలు నెరవేరుతాయి. ధన వ్య‌యము అధికంగా వుంటుంది. అవమానాలు ఎదురౌతాయి. తరుచూ ప్ర‌యాణాలు చేయవలసి వస్తుంది. పాదములు, ఎముకల నొప్పులబాధలుంటాయి. విలువైన వస్తువులను జాగ్ర‌త‌గా చూసుకోవాలి. వెంకటేశ్వరస్వామి ఆరాధన మేలు చేస్తుంది.

    – తూండ్ల కమలాకర శర్మ సిద్ధాంతి,
    కూకట్‌పల్లి, హైదరాబాద్
    +91 99490 11332.

    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular