Wednesday, March 29, 2023
More
    HomelatestHoroscope | 05-03-2023 నుంచి 11-03-2023 వ‌ర‌కు వార ఫ‌లాలు.. ఏ రాశి వారు ఏ...

    Horoscope | 05-03-2023 నుంచి 11-03-2023 వ‌ర‌కు వార ఫ‌లాలు.. ఏ రాశి వారు ఏ దైవాన్ని ఆరాధించాలంటే..?gu

    మేష రాశి: వివాదాలు పరిష్కారమ‌వుతాయి. సామాజిక బాధ్యతలు నిర్వర్తిస్తారు. వృత్తి, ఉద్యోగాలలో అభివృద్ధి వుంటుంది. వైద్య రంగంలోని వారికి గౌరవ మర్యాదలు లభిస్తాయి. ప్రయత్న పూర్వ‌క‌ కార్యములకు కొన్ని ఆటంకాలెదురైనా విజయం సాధిస్తారు. క్రీడాకారులకు అనుకూలంగా వుంటుంది. దుర్గాదేవి ఆరాధన శుభములను కలిగిస్తుంది.

    వృషభ రాశి: పితృ వర్గము వారి ఆశీస్సులతో కార్యసిద్ధి కలుగుతుంది. కోర్టు వ్యవహారాలలో సానుకూల పరిస్థితులు ఏర్పడుతాయి. సరియైన దిశలో ఆలోచనలు సాగుతాయి. పరిస్థితులను సరిగ్గా అంచనా వేస్తారు. వివాహ ప్రయత్నాలు సిద్ధిస్తాయి. నూతన వ్యక్తులతో కలయికలు లాభిస్తాయి. ధనప్రాప్తి కలుగుతుంది. ఆంజ‌నేయస్వామి ఆరాధన మేలు చేస్తుంది.

    మిథున రాశి: అపకీర్తి కలుగవచ్చును. వృత్తి, ఉద్యోగ మూలక చికాకులు కలుగుతాయి. నిరుత్సాహం ఆవరిస్తుంది. సన్నిహిత వ్య‌క్తులతో విభేదాలు రావచ్చును. శరీర బాధలు క‌లుగవచ్చును. ప్రయత్న కార్యములకు ఆటంకాలు ఎదురౌతాయి. దుర్జ‌నుల మూలంగా అశాంతి కలుగుతుంది. చెడు ఆలోచనలకు దూరంగా వుండండి. నరసింహస్వామి ఆరాధన చిక్కులను తొలగిస్తుంది.

    కర్కాటక రాశి: స్థిరాస్థి వ్యవహారాలలో తొందర పడకండి. నష్టములు క‌లుగ‌వ‌చ్చును. బహుముఖ ధన వ్యయము వలన మనశ్శాంతి లోపిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధులు బాధిస్తాయి. దుర్వార్తా శ్రవణం కలుగవచ్చును. ఉద్రేకమును అదుపులో ఉంచుకోకపోతే శతృవులు పెరుగుతారు. బంధుమిత్ర విరోధములు కలుగవచ్చును. విష్ణు ఆరాధన మనశ్శాంతినిస్తుంది.

    సింహ రాశి: బంధుమిత్రుల మూలకంగా సంతోషం కలుగుతుంది. ప్రముఖ వ్యక్తులతో కలయికలు లాభిస్తాయి. కీర్తి, ప్రతిష్ఠలు కలుగుతాయి. నూతన వస్తు ప్రాప్తి కలుగుతుంది. కొన్ని ప్రతిబంధకాలెదురైననూ ప్రయత్నకార్యాలు సిద్ధిస్తాయి. నిర్మాణాత్మకమైన చర్చలలో పాల్గొంటారు. ధనమునకు సంబంధించిన ఇబ్బందులు కొంతమేరకు తొలగిపోతాయి. సుబ్రహ్మణ్యారాధన శుభములను కలిగిస్తుంది.

    కన్యా రాశి: పరోపకారములచే గౌరవ మర్యాదలు లభిస్తాయి. ప౦డితులు శాస్త్ర సంబంధమైన చర్చలలో పాల్గొనడం వలన ఉల్లాసం కలుగుతుంది. శత్రుక్షయము కలుగుతుంది. శుభకార్యములకై ప్రయాణములు చేయవలసి వస్తుంది. నూతన గృహ నిర్మాణయత్నాలు ఫలిస్తాయి. ప్రయత్న కార్యములన్నీ నిర్విఘ్నంగా పూర్త‌వుతాయి. లక్ష్మీ దేవి ఆరాధన మరింత శుభాన్ని కలిగిస్తుంది.

    తులా రాశి: తల్లిదండ్రుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అధికారుల మూలకంగా అశాంతి కలుగవచ్చును. విలువైన వస్తువుల పట్ల జాగ్రత్త వహించండి. ఋణ‌ముల వలన అశాంతి కలుగుతుంది. సంతాన మూలకంగా అశాంతి కలుగవచ్చును. కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త పడండి. దత్తాత్రేయ స్వామి ఆరాధన అశాంతిని తొలిగిస్తుంది.

    వృశ్చిక రాశి: ఋణ దాతల ఒత్తిడి అశాంతిని కలిగిస్తుంది. అకారణ కలహముల వలన మనశ్శాంతి లోపిస్తుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. స్థిరాస్థి ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల ఆదరణతో సమస్యలు దూరమవుతాయి. ప్రయత్న కార్యములు నెరవేరుతాయి. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సుబ్రహ్మణ్యారాధన అశాంతిని తొలగిస్తుంది.

    ధనుస్సు రాశి: ప్రభుత్వ అధికారుల మూలకంగా కావలసిన పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. పిల్లలపై శ్రద్ధ వహిస్తారు. సామాజిక బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారస్థులకు మంచి ఖ్యాతి లభిస్తుంది, దూర ప్రాంతముల నుండి శుభావార్తలు వింటారు. ఆదాయానికి సరిపడా ఖర్చులు సిద్ధంగా వుంటాయి. గ‌ణ‌పతి ఆరాధన శుభములనిస్తుంది.

    మకర రాశి: వృత్తి, ఉద్యోగాలలో ప్రతికూల పరిస్థితులుంటాయి. ఎముకలు, నరాలకు సంబంధించిన శరీర బాధలు కలుగవచ్చును. మోసపోయే ప్రమాదమున్నది జాగ్రత్తగా వుండండి. కార్య విఘ్న‌ములు కలుగుతుండడంవలన వృధా సంచారము చేయవలసి వస్తుంది. బంధు మిత్రులతో విరోధము లేర్పడవచ్చును. శివారాధన వలన కొంత ఉపశమనం లభిస్తుంది.

    కుంభ రాశి: సత్ప్రవర్తనను కలిగివుంటారు. స్థిరాస్థి మూలకంగా లాభములుంటాయి. క్రీడాకారులకు శ్రమతో కూడిన విజయాలు లభిస్తాయి. బహుమానములు పొందుతారు. కుటుంబ సభ్యుల మూలకంగా సంతోషాన్ని పొందుతారు. దీర్ఘకాలిక వ్యాధులు కొంత ఉపశమిస్తాయి. ఊహించిన దానికి భిన్నంగా కార్యసిద్ధి కలుగుతుంది. స్వల్ప ధనప్రాప్తి కలుగవచ్చును. లక్ష్మీ నారాయణుల ఆరాధన మరింత మేలు కలిగిస్తుంది.

    మీన రాశి: దానధర్మాది పుణ్యకర్మలను నిర్వ‌ర్తిస్తారు. కీర్తి, ప్రతిష్టలు లభిస్తాయి. శరీర సౌఖ్యము వలన ఉల్లాసంగా వుంటారు. వృత్తి, ఉద్యోగాలలో మీ స్థానానికి గుర్తింపు లభిస్తుంది. జీవిత భాగస్వామితో సంభాషణలు ఆనందాన్నిస్తాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. శుభ కార్యచ‌రణమునకై ఆలోచనలు సాగుతాయి. నవగ్రహ శ్లోకాలను పఠించండి, చిక్కులు తొలగిపోతాయి.

                                                                                         – తూండ్ల కమలాకర శర్మ సిద్ధాంతి,
                                                                                               కూకట్‌పల్లి, హైదరాబాద్
                                                                                          ఫోన్‌ నంబర్‌ : +91 99490 11332

    spot_img
    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular