Weight Loss | బరువు తగ్గించే ఇంజక్షన్‌ను వెగోవీ అనే పేరుతో ప్రముఖ ఫార్మా సంస్థ నోవో నోర్‌డిస్క్ విడుదల చేసింది. ఇప్పటికే అమెరికా, జర్మనీ, నార్వే, డెన్మార్క్ దేశాల్లో ఈ ఇంజక్షన్ను మార్కెట్‌లోకి తీసుకురాగా.. తాజాగా యూకేలోనూ దీనిని అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే యూకేలో వీటిని పరిమిత స్థాయిలోనే విడుదల చేస్తున్నామని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. అమెరికా తదితర దేశాల్లో ఈ ఇంజక్షన్ వల్ల సానుకూల ఫలితాలు రావడంతో డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. ఆ డిమాండ్‌ను […]

Weight Loss |
బరువు తగ్గించే ఇంజక్షన్‌ను వెగోవీ అనే పేరుతో ప్రముఖ ఫార్మా సంస్థ నోవో నోర్‌డిస్క్ విడుదల చేసింది. ఇప్పటికే అమెరికా, జర్మనీ, నార్వే, డెన్మార్క్ దేశాల్లో ఈ ఇంజక్షన్ను మార్కెట్‌లోకి తీసుకురాగా.. తాజాగా యూకేలోనూ దీనిని అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే యూకేలో వీటిని పరిమిత స్థాయిలోనే విడుదల చేస్తున్నామని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.
అమెరికా తదితర దేశాల్లో ఈ ఇంజక్షన్ వల్ల సానుకూల ఫలితాలు రావడంతో డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. ఆ డిమాండ్‌ను తట్టుకోవడానికే యూకేలో ఈ ఇంజక్షన్ విడుదలను సంస్థ వాయిదా వేయాల్సి వచ్చింది. ఇక్కడ కూడా డిమాండ్ పోకడను పరిశీలిస్తున్నామని.. ఇక్కడి వారి అనుభవాలు చూశాక… సరఫరాను పెంచుతామని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఇలా పనిచేస్తుంది..
బరువు తగ్గడానికి ఉపయోగపడే ఈ వెగోవీ ఇంజక్షన్ కడుపు నిండిదంనే భావనను ఎక్కువగా కలగజేస్తుంది. అంటే మనకు ఆకలిగాఉన్నా మెదడుకు మాత్రం కడుపు నిండినట్టే సందేశాలు వెళతాయి. దీంతో మనల్ని ఆహారం తీసుకోవాలని మెదడు సూచించదు. జీవనశైలి మార్పు, వ్యాయామం చేస్తూ ఈ ఇంజక్షన్ తీసుకున్న వారు సగటున వారి బరువులో 15 శాతం తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి.
యూఎస్‌లో దీనిని 1350 డాలర్ల (సుమారు రూ. లక్షా 12 వేలు)కు విక్రయిస్తుండగా యూకే ధరలపై ఎటువంటి సమాచారం లేదు. మరోవైపు ఈ ఇంజక్షన్‌కు డిమాండ్ అంతకంతకూ పెరిగిపోతుండటంతో తమకు చాలా ఇబ్బందిగా ఉంటోందని నోవో నోర్‌డిస్క్ సీఈఓ చెప్పుకొచ్చారు. ఇప్పడు ఉన్న డిమాండ్‌ను అందుకోవాలంటే తమకు కొన్ని ఏళ్లు పడుతుందని ఆయన వ్యాఖ్యానించడం విశేషం.
